వ్యాధులకు పంటలకు లింకేంటి..?
సాక్షిలైఫ్ : వ్యాధులకు పండే పంటలకు లింకేంటి..? అంటే లింక్ ఉందని అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు. పురుగుమందులు వేసి పండించిన పంటల కారణంగా జనాలు మరింతగా రోగాల బారిన పడుతున్నారని వారు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో లభించే అనేక ఉత్పత్తులు నాణ్యత లేకాపడం కూడా జబ్బులు పెరగడానికి ప్రధాన కారణమని వారు అంటున్నారు.
ఇటీవల కాలంలో లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక వ్యాధులు బారీనపడుతున్నారు ప్రజలు. ప్రధానంగా ఆహారపదార్థాల్లో కల్తీతోపాటు పురుగుమందులు వేసి పండించిన పంటలవల్ల కూడా దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతున్నాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
దైనందిన జీవితంలో సాధారణ అలవాట్ల ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? తృణధాన్యాలు ఎలా తింటే మంచిది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు శ్రీదేవి సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
