మోకాలి ఆర్థరైటిస్ చికిత్సలో పీఆర్పీ ఇంజెక్షన్‌ల ప్రధాన లక్ష్యం ఏమిటి..?

షేర్ చేయండి:
మోకాలి ఆర్థరైటిస్ చికిత్సలో పీఆర్పీ ఇంజెక్షన్‌ల ప్రధాన లక్ష్యం ఏమిటి..?

సాక్షి లైఫ్ : పిఆర్ఫీ ఇంజెక్షన్‌ల వల్ల మోకాళ్లలో పూర్తిగా అరిగిపోయిన గుజ్జు (మృదులాస్థి) తిరిగి వస్తుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? పిఆర్ఫీ థెరపీ మోకాలి నొప్పులను ఎలా తగ్గిస్తుంది? మోకాలి సమస్యల చికిత్సలో పిఆర్ఫీ ఇంజెక్షన్‌లకు,మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి..? పిఆర్ఫీ చికిత్సకు ఏ రకమైన మోకాలి సమస్యలు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి? పిఆర్ఫీ అంటే ఏమిటి..?దీనిని మోకాలి చికిత్సలో ఎందుకు ఉపయోగిస్తారు?

ఇది కూడా చదవండి..స్టమక్ క్యాన్సర్ సంకేతాలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఇది కూడా చదవండి..కంటి సంబంధిత ఏయే సమస్యలకు లీచ్ థెరపీని సిఫార్సు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

మోకాలి ఆర్థరైటిస్ చికిత్సలో పీఆర్పీ (ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా) ఇంజెక్షన్ల ప్రధాన లక్ష్యం మోకాలి నొప్పిని తగ్గించి, కీలు పనితీరును మెరుగు పరచడం. దీని ద్వారా, రోగి రోజువారీ కార్యకలాపాలను సులభంగా నిర్వహించగలుగుతారు. పీఆర్పీ థెరపీలో, రోగి రక్తాన్ని సేకరించి, దాని నుంచి ప్లేట్‌లెట్‌లను వేరు చేస్తారు. ఈ ప్లేట్‌లెట్‌లలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే ప్రోటీన్‌లు అధికంగా ఉంటాయి. వీటిని తిరిగి మోకాలి కీలులోకి ఇంజెక్ట్ చేసినప్పుడు, అవి దెబ్బతిన్న కణజాలం (ఉదాహరణకు, మృదులాస్థి) పునరుద్ధరణకు సహాయపడతాయి.

నొప్పి నివారణ: మోకాలిలో వాపును, నొప్పిని తగ్గించడం. కార్టిలేజ్ రక్షణ: మృదులాస్థి (cartilage) మరింత అరిగిపోకుండా కాపాడడం. కీలు పనితీరు మెరుగుదల: మోకాలి కదలికను సులభతరం చేసి, దాని పనితీరును మెరుగుపరచడం. ఈ చికిత్స సాధారణంగా తేలికపాటి నుంచి మధ్యస్థ ఆర్థరైటిస్ ఉన్నవారికి లేదా శస్త్రచికిత్స అవసరం లేని వారికి సిఫార్సు చేస్తారు.

మోకాలి ఆర్థరైటిస్ చికిత్సలో పీఆర్పీ ఇంజెక్షన్‌ల ప్రధాన లక్ష్యం ఏమిటి..?

A. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను తప్పించడం

B. కీలు గుజ్జును పూర్తిగా తిరిగి నిర్మించడం

C.  నొప్పి నివారణకు.

D. శరీర బరువును తగ్గించడం

ఆన్సర్ C. నొప్పి నివారణకు.

 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.