ఒబేసిటీకి, నైట్ షిఫ్ట్ కి, ఇన్ఫెర్టిలిటీకి సంబంధం ఏమిటి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుతం వర్క్ స్టైల్ లో చాలా మార్పులు చోటుచేసు కుంటున్నాయి. అందులోభాగంగానే నైట్ షిఫ్ట్‌ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. అయితే, నిరంతరం రాత్రి షిఫ్ట్‌లలో పనిచేయడం వల్ల మహిళలల్లోను, పురుషుల్లోనూ ఫెర్టిలిటీ ఇష్యూస్ రావడమేకాకుండా ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. డయాబెటిస్ లేదా ఊబకాయం బాధితులుగా మార్చడమే కాకుండా సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది.  

 నైట్ షిఫ్ట్‌లు సంతానోత్పత్తి మధ్య సంబంధం..?

నైట్ షిఫ్ట్‌లు సంతానోత్పత్తి మధ్య సంబంధాన్ని చూపించడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, నైట్ షిఫ్టులలో పనిచేయడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. ఇది సంతానోత్పత్తితో సహా అనేక శారీరక ప్రక్రియలకు అవసరం. మహిళలు రాత్రి షిఫ్టులలో పనిచేయడంవల్ల ఇర్రిగ్యులర్ పీరియడ్స్, గర్భస్రావం ,గర్భం దాల్చడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
 
మహిళలకు, రాత్రి షిఫ్ట్‌లు రుతుక్రమం సక్రమంగా లేకపోవడం, గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరగడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు కలిగిస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. సిర్కాడియన్ రిథమ్ అంతరాయం వల్ల అండోత్సర్గము, గర్భధారణను నిర్వహించడానికి అవసరమైన ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి ముఖ్యమైన పునరుత్పత్తి హార్మోన్ల స్రావం ప్రభావితమవుతుంది.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

 

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

అదే సమయంలో పురుషులలో రాత్రిపూట షిఫ్ట్ కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడమేకాకుండా, టెస్టోస్టెరాన్ స్థాయి కూడా తగ్గవచ్చు. దీని కారణంగా ఇతర హార్మోన్లు కూడా అసమతుల్యత చెందవచ్చు, దీనివల్ల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.