ప్రోటీన్ సప్లిమెంట్లు ఎలాంటి వాళ్లకు అవసరం..?
సాక్షి లైఫ్ : ఆహారం, జీవనశైలికి సంబంధించిన సిఫార్సులకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు వెల్లడించింది ఐసీఎంఆర్-ఎన్ఐఎన్. ఈ సంస్థ ప్రోటీన్ సప్లిమెంట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శరీరానికి ప్రోటీన్ ను అందించేందుకు ఆరోగ్యకరమైన పోషకాహారం సరిపోతుందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్) పోషకాల లోపాలను నివారించడానికి అలాగే భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పరిష్కరించడానికి 17 ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
కొత్త మార్గదర్శకాల ప్రకారం రోజుకి ప్రోటీన్ 0.83కిలోగ్రాములు తీసుకోవాలని, సగటున రోజుకి కనీసం 0.66కిలోగ్రాములు తీసుకున్నా సరిపోతుందని తెలిపింది. సూక్ష్మపోషకాలు,సమతుల్య ఆహారంలో వాటి ప్రాముఖ్యత గురించి ప్రచారం జరగడం వల్లే ప్రజలు ఇతర కృత్రిమ పోషక పదార్ధాలతో పాటు ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ సప్లిమెంట్లను ఆశ్రయించారు" అని పోషకాహార నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు.
ఈ ప్రోటీన్ పౌడర్‌లను సాధారణంగా గుడ్లు, పాలు, సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతో తయారు చేస్తారు. కొన్నిసార్లు వీటి మూలాల మిశ్రమంతో తయారు చేస్తారు. చక్కెరతో కూడిన ఈ సప్లిమెంట్‌లు సమతుల్య ఆహారం ఉద్దేశ్యాన్ని విరుద్ధంగా ఉండడమే కాకుండా, మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి" అని డాక్టర్లు చెబుతున్నారు.
పప్పుధాన్యాలు, పప్పులు, గింజలు, విత్తనాలు, గుడ్లు, కోడి మాంసం, చేపలు మొదలైన వాటి ద్వారా అన్ని వయసుల వారికి సమతుల ఆహారం అందుతుందని, వీటిని తీసుకోవడం ద్వారా అన్నారు. ఏ రకమైన ప్రొటీన్ పౌడర్‌లు,సప్లిమెంట్‌లను తీసుకునే ముందు ఒక వ్యక్తి ప్రోటీన్ పరిస్థితిని కూడా అంచనా వేయాలి. అర్హత కలిగిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ద్వారా తనిఖీ చేయాలి. మంచి నాణ్యమైన ప్రొటీన్‌ను పొందడానికి 3:1 నిష్పత్తిలో పప్పులతో కూడిన తృణధాన్యాలు శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందించడానికి సహాయపడుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.
సమతుల్యమైన ఆహారం శరీర పనితీరుకు అవసరమైన 20 ముఖ్యమైన అమైనో ఆమ్లాల అవసరాన్ని తీర్చాలి. మన శరీరంలో సంశ్లేషణ చేయలేని ఈ అమైనో ఆమ్లాలలో కొన్నింటిని పొందడానికి, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు , ప్రోటీన్ వంటి విభిన్న ఆహార సమూహాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
"సాధారణ, ఆరోగ్యకరమైన వ్యక్తులకు ప్రోటీన్ సప్లిమెంట్లు సిఫార్సు చేయబడవు. తీవ్ర అనారోగ్యంతో, ఆసుపత్రిలో చేరిన రోగులకు ప్రొటీన్ సప్లిమెంట్లు అవసరం కావచ్చు, వీటిని వైద్య నిపుణులు సిఫార్సు చేసి పర్యవేక్షించాలి” అని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
