యూరిక్ యాసిడ్ ఎంత ఉంటే నార్మల్..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యూరిక్ యాసిడ్ శరీరానికి అవసరమైన మూలకం. అయితే దాని పరిమాణం సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. దీనికారణంగా పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా వయోజన మహిళల్లో యూరిక్ యాసిడ్ 2.5 నుంచి 6 మిల్లీగ్రామ్స్ పర్ డెసీలీటర్ (ఎంజీ\ డీఎల్) మధ్య ఉంటే, అది సాధారణమైనదిగా పరిగణిస్తారు. 6 mg/dL కంటే ఎక్కువగా ఉంటే యూరిక్ యాసిడ్ పెరిగినట్లు నిర్ధారిస్తారు. 

 పురుషుల్లో..  

వయోజన పురుషుల శరీరంలో యురిక్ యాసిడ్ 3.5 నుంచి 7 మిల్లీగ్రామ్స్ పర్ డెసీలీటర్..(ఎంజీ\ డీఎల్)వరకు సాధారణ స్థాయిలుగా చెబుతారు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే..? దానిని నియంత్రించాలి. యూరిక్ యాసిడ్ సమస్యను ముందుగానే గుర్తిస్తే, కొన్ని నెలల్లో పూర్తిగా సాధారణ స్థాయికి తీసుకురావచ్చు. అందువల్ల, ప్రజలు ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోవాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ దాని పర్యవేక్షణ చాలా ముఖ్యమని యూరాలజిస్టులు చెబుతున్నారు.

 ఎక్కువ కాకుండా..

మొదట్లో యూరిక్ యాసిడ్‌ను మందులు లేకుండా నియంత్రించవచ్చు. ఇందుకోసం రెడ్ మీట్ సహా నాన్ వెజ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా తగ్గించి, తగినన్ని నీళ్లు తాగాలి. ఇది కాకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యూరిక్ యాసిడ్ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే, ఈ విషయాలన్నీ కాకుండా డాక్టర్ ఇచ్చే మందులను సరిగ్గా తీసుకుంటూ, ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోవాలి. 

ఇది కూడా చదవండి.. గర్భం దాల్చడానికి ముందు ఈ టెస్టులు తప్పనిసరి 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.