చాందీపురా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
సాక్షి లైఫ్: గత కొన్ని రోజులుగా గుజరాత్‌లో చాందీపురా వైరస్ కేసులు పెరుగుతుండడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ సోకడం వల్ల కొంతమంది చిన్నారులు చనిపోయారు. ఈ వైరస్ కారణంగా మరికొంతమంది పిల్లలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అసలు చాందీపురా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. తెల్ల రక్త కణాలకు, ఎర్ర రక్త కణాలకు తేడా..?
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
చాందీపురా వైరస్ 9 నెలల నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. అపరిశుభ్రత, చెత్తాచెదారం ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులు పంచమహల్, సంబర్‌కంఠ, ఆరావళి నుంచి వస్తున్నాయి.
ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది..?
చాందీపురా వైరస్ లక్షణాలు ఫ్లూ లాంటి లక్షణాలే కలిగి ఉంటాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్ దోమలు, ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. చాందీపురా వైరస్ మెదడులో వాపు వస్తుందని వారు అంటున్నారు.
చాందీపురా అనే పేరు ఎలా వచ్చింది..?
1966లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా చాందీపూర్ గ్రామంలో మొదటగా ఈ చాందీపురా వైరస్ కారణంగా 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోయారు. దీంతో ఆ వైరస్‌కు "చాందీపురా వైరస్" అని పేరు పెట్టారు.
జాగ్రత్తలు..?
ఈ వైరస్ దోమలు, ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి. ఇవి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వీలైనంత వరకూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు చెబుతున్నారు. భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వారు అంటున్నారు.
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
