సమ్మర్ లో అనారోగ్య సమస్యలున్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..?
సాక్షి లైఫ్ : ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. 40 డిగ్రీలకు ఏమాత్రం తగ్గడంలేదు. హైదరాబాద్ నగరంలో సైతం ఎన్నడూ లేనివిధంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ పెట్టాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలపు వేడి, మధుమేహం, గుండె జబ్బులు, ఉబ్బసం, క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారికే కాక ఇతరాత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా అవి పెరిగేలా అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది.
ఇది కూడా చదవండి.. వేసవిలో కళ్లు ఎర్రబడుతున్నాయా..? ఇవిగో చిట్కాలు..
డీహైడ్రేషన్..
ఈ ఎండాకాలపు వేడిలో, మధుమేహ సమస్యలు ఉన్నవారు తమ రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెమటలు పట్టడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి రోజంతా తరచుగా నీటిని తీసుకొంటూ శరీరానికి నీటి కొరత లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అస్సలు చక్కెర కలపని లేదా తీపి తక్కువున్న పానీయాలను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఎండలేని సమయాల్లో..
పగలు ఎండలేని సమయాల్లో మాత్రమే బయటికి వెళ్ళి తమ పనులను పూర్తి చేసుకోవడం, శరీరానికి గాలి బాగా ఆడే బట్టలను వేసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని ఓమ్ని హాస్పిటల్స్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డా.నాగవేందర్ రావు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
