వేసవిలో కళ్లు ఎర్రబడుతున్నాయా..? ఇవిగో చిట్కాలు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో జనాలు డీహైడ్రేషన్ తోపాటు కంటి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటు న్నారు. శరీరంలో వేడి పెరగడంతో కళ్లు ఎర్రబడడంతోపాటు మండుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కంటి సంరక్షణకు ఖచ్చితమైన చిట్కాలను అనుసరించడం ద్వారా ఆయా సమస్యల నుంచి పరిష్కారం పొందవచ్చు. అందుకోసం ఇంటి చిట్కాలను పాటించండి.  

ఇది కూడా చదవండి.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు.. 

 ఉష్ణోగ్రతలు పెరగడంతో.. 

సూర్యుడి భగభగలతో జనం అల్లాడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒక్కసారిగా ఆ ప్రభావం కళ్ళపై తీవ్రంగా పడుతోంది. దీని కారణంగా కళ్లలో మంట, దురద, ఎర్రబడడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎండా కాలంలో చాలా మందికి కళ్లు ఎర్రగా మారుతూ ఉంటాయి. దీనికి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.  

 ఐస్ ప్యాక్‌లు.. 

వేసవిలో మీ కళ్లు ఎర్రగా మారితే వాటిపై ఐస్ ప్యాక్‌లు వేయడం ద్వారా కళ్లు కాస్త చల్లబడి కొంతమేర ఉపశమనం కలుగుతుంది. ఐస్ ప్యాక్ బదులు ఒక కాటన్ రుమాలులో ఐస్ క్యూబ్‌ను చుట్టి, 5 నుంచి 10 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. ఇలా చేయడం వల్ల కళ్లు చల్లబడి కొంతమేర ఎర్రబడడం తగ్గుతుంది. 

కీరదోసకాయ.. 

కళ్లలోని ఎరుపును తొలగించాలంటే కీరదోసకాయ ముక్కలను కళ్లపై  అరగంట పాటు ఉంచండి. రోజుకు రెండుసార్లు చేస్తే దోసకాయలోని శీతలీకరణ గుణాలు కళ్లను చల్లబరుస్తాయి.  రక్తనాళాల్లో వాపులను తొలగించడంలో సహాయపడతాయి.

కళ్లు ఎర్రబడితే టీ బ్యాగ్‌ను నీటిలో ముంచి, రిఫ్రిజిరేటర్‌లో సుమారు 2 గంటలు ఉంచండి. ఆ తర్వాత, టీ బ్యాగ్‌లను కళ్లపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

 ఈ సమస్యల నుంచి.. 

కంటి అలసట, చికాకు నుంచి ఉపశమనం పొందడానికి మీరు కళ్లలో రోజ్ వాటర్‌ వేసుకోవచ్చు. ఇది కళ్ళను శుభ్రపరుస్తుంది. కళ్లు ఎర్రబడటం పోవాలంటే ఎప్పటికప్పుడు కళ్లలో చల్లటి నీటితో తడుపుతూ ఉండాలి. ఇలా చేస్తే కంటిలో దురద, ఎర్రబడడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ ఇవి ఉపశమనం కలిగించకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

ఇది కూడా చదవండి.. న్యూ స్టడీ : యువతలో క్యాన్సర్ వేగంగా పెరగడానికి కారణాలు ఇవే.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.