రక్తదానం చేయడం వల్ల నిజంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చా..?

షేర్ చేయండి:
రక్తదానం చేయడం వల్ల నిజంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చా..?

సాక్షి లైఫ్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా జరుపుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ), ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీస్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ (ఐఎఫ్బీడీఓ) ,ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (ఐఎస్బీటీ) వంటి అంతర్జాతీయ సంస్థలు 2004లో రక్తదాన దినోత్సవాన్ని మొదటిసారిగా గుర్తించాయి. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం, స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేయడం దీని లక్ష్యం. రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?   

బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటి..?

రక్తదానం శరీరానికి అనేక మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్త దానం చేయడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.. 
ఒత్తిడి తగ్గుతుంది

రక్తదానం సమయంలో ఫ్రీ హెల్త్ చెకప్ అంటే శరీరంలో ఏమైనా అనారోగ్య సమస్యలుంటే గుర్తించడానికి వీలవుతుంది. 
ప్రతికూల భావోద్వేగాలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది
ఆరోగ్యకరమైన గుండె, రక్తనాళ వ్యవస్థ సాఫీగా పనిచేస్తుంది. 
తరచుగా రక్తదానం చేయడం వల్ల రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 

ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి..?  

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.