ఆహారం విషయంలో ఏది బెటర్ శాఖాహారమా..? మాంసాహారమా..?  

షేర్ చేయండి:
ఆహారం విషయంలో ఏది బెటర్ శాఖాహారమా..? మాంసాహారమా..?  

సాక్షి లైఫ్ : ఆహారం మన జీవితంలో చాలా ముఖ్యమైంది. శారీరక ఆరోగ్యం, మానసిక స్థితి, పర్యావరణం, జీవనశైలికి సంబంధించిన అంశాలు అన్ని ఆహారంమీదనే ఆధారపడి ఉంటాయి.ఈ నేపథ్యంలో శాఖాహారం, మాంసాహారం ఈ రెండిటిలో ఏదొక దానిని ఎంపిక చేసే సమయంలో వివిధ కారణాలను పరిశీలిస్తారు. శాఖాహారం అనేది ఆరోగ్యానికి మంచి ఫలితాలను ఇస్తున్నాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇక మాంసాహారం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల సమృద్ధి వల్ల శక్తిని పెంచుతుందని భావిస్తారు. అయితే, ఈ రెండు ఆహార పద్ధతులలో ఒక్కోకటి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు, దుష్ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే..? ఏది బెటర్ శాఖాహారమా..? మాంసాహారమా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు


ప్రపంచ శాఖాహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న జరుపుకుంటారు. శాఖాహార జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వతేదీన వరల్డ్ వెజిటేరియన్ డేని నిర్వహిస్తారు.  ఈ డే జంతు హక్కులు, పర్యావరణ సుస్థిరత, మానవ ఆరోగ్యం కోసం మద్దతు ఇస్తుంది.   

శాఖాహార ఆహారం ప్రయోజనాలు..   

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో.. 

శాఖాహారంలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడం.. 

 శాఖాహారం ఆహారంలో అధిక ఫైబర్, పోషకాలు ఆకలిని నియంత్రించ డంలో, జీవక్రియను పెంచడంలోనూ స్థిరమైన బరువు తగ్గడానికి తోడ్పడతాయి.

మెరుగైన ప్రేగు ఆరోగ్యం..  

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే మొక్కల ఆధారిత ఆహారం వైవిధ్యమైన గట్ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. 

క్యాన్సర్ నివారణ.. 

శాకాహార ఆహారం పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.