టెఫ్లాన్ ఫ్లూ ప్రభావం ఎవరిపై ఎక్కువ అంటే..? 

షేర్ చేయండి:
టెఫ్లాన్ ఫ్లూ ప్రభావం ఎవరిపై ఎక్కువ అంటే..? 

సాక్షి లైఫ్ : నాన్‌స్టిక్ కోటింగ్ టెఫ్లాన్ ను అనేక రకాల వంటసామాను వస్తువులపై ఉపయోగిస్తున్నారు. టెఫ్లాన్ అనేది ఓ రకమైన రసాయనిక సమ్మేళన పూత. జ్వరం, కండరాల నొప్పి, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి వంటి ఫ్లూ వంటి లక్షణాలతో ఈ టెఫ్లాన్ ఫ్లూ మొదలవుతుంది. నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడి చేయడం, లేదా సరైన విధానంలో ఉపయోగించక పోవడం వల్లనే టెఫ్లాన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నా యని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.  

ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?

ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

టెఫ్లాన్ ఫ్లూ, పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ అని కూడా పిలుస్తారు.ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..? సేమ్ టూ సేమ్ వైరల్ ఫీవర్ మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. టెఫ్లాన్ ఫ్లూ వచ్చినప్పుడు తలనొప్పి, శరీర నొప్పులు, జ్వరం, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయని వారు అంటున్నారు. గత సంవత్సరం 267 మందికి పైగా అమెరికన్లు ఈ "టెఫ్లాన్ ఫ్లూ" కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అమెరికన్లు నాన్‌స్టిక్ ప్యాన్‌లలో సరైన పద్దతిలో వంట చేయకపోవడం వల్ల టెఫ్లాన్ ఫ్లూ బారీన పడుతున్నారు. 

 నాన్ స్టిక్ పాన్..

వంట చేసేటప్పుడు నాన్ స్టిక్ పాన్ల నుంచి వచ్చే పొగ కారణంగా 12 గంటల నుంచి 24 గంటలలోపు దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ లక్షణాలు తాత్కాలికమే అయినప్పటికీ, నిపుణులు ఈ పరిస్థితి వల్ల ఎలాంటి నష్టం ఉండదని చెబుతుండగా, మరికొందరు మాత్రం టెఫ్లాన్ ఫ్లూ భవిష్యత్ లో మరిన్ని అనారోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.