చాందీపురా వైరస్‌ చిన్నారులకే ఎందుకొస్తుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చాందీపురా వైరస్‌ 'రబ్డోవిరిడె’ అనే వైరస్‌ ఫ్యామిలీకి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ 'శాండ్ ఫ్లై' అనే కీటకం ద్వారా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కేవలం15 ఏళ్ల వయసున్న చిన్నారులు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. 

ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

చిన్నారుల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండడం కారణంగానే ఈ వైరస్ వీరిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పెద్దవారిలోను చాందీపురా వైరస్‌ వచ్చే ముప్పు ఉందని, ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికి ఇది వచ్చే అవకాశాలున్నాయని వెల్లడిస్తున్నారు డాక్టర్లు. 

గతంలోనూ..  

చాందీపురా వైరస్ మరణాల రేటు 56 శాతం నుంచి 75శాతం వరకూ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2003-2004 మధ్యకాలంలో భారతదేశంలో ఈ చాందీపురా వైరస్ వ్యాప్తి తీవ్రంగా కనిపించింది. 56 నుంచి75 శాతం వరకు మరణాల రేటు ఉంది. చాందీపురా వైరస్ ను 1965లో మొదటిసారిగా భారతదేశంలోని మహారాష్ట్ర లోని నాగ్‌పూర్ జిల్లాలో  గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా ,గుజరాత్‌లలో గతంలో పలు కేసులు నమోదయ్యాయి. 

ఇది కూడా చదవండి.. లెమన్‌గ్రాస్ హెర్బల్ టీ తయారు చేసే విధానం.. 

 ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..   

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.