మహిళల మాదిరిగానే పురుషుల్లో కూడా మెనోపాజ్ వస్తుందా..?
సాక్షి లైఫ్ : స్త్రీల మాదిరిగానే పురుషులకు కూడా మెనోపాజ్ దశ అనేది ఒకటుందా..? మీరు మేల్ మెనోపాజ్ గురించి పెద్దగా విని ఉండకపోవచ్చు. ఇది నిజంగా జరుగుతుందా..? లేదా ఇది అపోహనా..? దీని గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.. మేల్ మెనోపాజ్ అంటే ఏమిటి..? ఎలాంటి వారిలో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది..?
ఇది కూడా చదవండి.. త్వరలో వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ..
మగవారిలో కూడా మెనోపాజ్ సమస్య తలెత్తుతుంది. అయితే ఇది కొంతమందిలో మాత్రమే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 45-55 సంవత్సరాల మధ్య పురుషులలో ఈ సమస్య ప్రారంభమవుతుంది. ఈ కాలంలో టెస్టోస్టెరాన్ స్థాయి క్రమంగా తగ్గడం మొదలవుతుంది. దీనిని "మేల్ మెనోపాజ్" అని కూడా అంటారు. "మేల్ మెనోపాజ్ " ను "ఆండ్రోపాజ్ "అని కూడా అంటారు.
మేల్ మెనోపాజ్ లక్షణాలు..
మహిళలు అయితే 45-55 సంవత్సరాల వయస్సులో మెనోపాజ్ సమస్య తలెత్తుతుంది. మెనోపాజ్ అంటే పీరియడ్స్ రావడం ఆగిపోతాయని మహిళల్లో మెనోపాజ్ గురించి మీకు తెలిసి ఉండవచ్చు. ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అంతేకాదు పెరుగుతున్న వయస్సు కారణంగా పురుషులలో కూడా కొన్ని హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. అయితే మెనోపాజ్ లాంటిది పురుషులలో కూడా జరుగుతుందా..? మహిళల్లాగే పురుషులకు కూడా హార్మోన్లు తగ్గుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
