Health Problems : పురుషుల కంటే స్త్రీలల్లోనే ఎక్కువ వ్యాధులు..ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా సర్వేలో వెల్లడి..

షేర్ చేయండి:
Health Problems : పురుషుల కంటే స్త్రీలల్లోనే ఎక్కువ వ్యాధులు..ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా సర్వేలో వెల్లడి..

సాక్షి లైఫ్ : భారతదేశంలో మహిళల శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితిపై జాతీయ నమూనా సర్వే కార్యాలయం (NSSO) విడుదల చేసిన తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సమాజంలో, కుటుంబంలో అందరి ఆరోగ్యాన్ని పట్టిపట్టే స్త్రీలు.. తామే ఎక్కువ రోగాల బారిన పడుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో వ్యాధుల తీవ్రత, అనారోగ్య రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

ఇది కూడా చదవండి..Higher Risk of Ear Infections : డయాబెటిస్ ఉన్నవారిలో చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..? ఎందుకు..?

ఇది కూడా చదవండి..Hormonal Imbalance : మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతతోనే అధిక బరువు సమస్య.. 

 

ప్రతి లక్ష మందిలో.. మహిళలే టాప్..!

సర్వే జరగడానికి ముందు 15 రోజుల వ్యవధిని ప్రాతిపదికగా తీసుకుంటే, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అనారోగ్యానికి గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రతి లక్ష మంది జనాభాకు పురుషులలో 13,504 అనారోగ్య కేసులు నమోదు కాగా, మహిళల్లో ఈ సంఖ్య ఏకంగా 17,006గా ఉంది. గుండె సంబంధిత సమస్యల్లోనూ స్త్రీలదే పైచేయిగా ఉంది. లక్ష జనాభాలో పురుషులలో 3,523 గుండె జబ్బుల కేసులు ఉంటే, మహిళల్లో 4,273 కేసులు నమోదయ్యాయి.

 హార్మోన్లు, ఎముకల సమస్యలు..  

మహిళలను ప్రధానంగా కండరాలు, ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటివి తీవ్రంగా వేధిస్తున్నాయి. వీటితో పాటు హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే థైరాయిడ్ రుగ్మతలు, అధిక రక్తపోటు (B.P),రకరకాల ఇన్ఫెక్షన్లు మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు నివేదిక చెబుతోంది. మరోవైపు, పురుషులు ఎక్కువగా హఠాత్తుగా వచ్చే గుండెజబ్బులు, ఛాతీ నొప్పి, ప్రమాదాల వల్ల జరిగే శారీరక గాయాల బారిన పడుతున్నారు.

మానసిక ఒత్తిడి.. నిశ్శబ్ద శత్రువు..

శారీరక సమస్యల కంటే స్త్రీలను మానసిక సమస్యలు మరింత కుంగదీస్తున్నాయి. డిప్రెషన్ (కుంగుబాటు), తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన (Anxiety) వంటి నాడీ సంబంధిత సమస్యలు మహిళల్లోనే అధికంగా నమోదయ్యాయి.

నిపుణులు ఏమంటున్నారంటే..?

ఇటు ఇల్లు, అటు ఆఫీసు బాధ్యతలను సమన్వయం చేసుకోవడం, కుటుంబ సభ్యుల సంరక్షణ భారాన్ని నెత్తినేసుకోవడం, సమాజం నుంచి ఉండే అంచనాలు స్త్రీలపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇది వారి క్రియాత్మక, ఆర్థిక శ్రేయస్సును కూడా దెబ్బతీస్తోంది.

శ్వాసకోశ వ్యాధుల్లో సమానత్వం..!

అయితే, కొన్ని రకాల వ్యాధులు మాత్రం లింగబేధం లేకుండా ఇరువర్గాలనూ ఒకేలా పీడిస్తున్నాయి. ముఖ్యంగా జలుబు, గొంతు నొప్పి, ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి కాలానుగుణ (Seasonal) వ్యాధుల విషయంలో పురుషులు, మహిళల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక స్పష్టం చేసింది. మహిళల ఆరోగ్యం కేవలం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదని, అది దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధిని శాసించే అంశమని ఈ గణాంకాలు గుర్తుచేస్తున్నాయి. ఇప్పటికైనా స్త్రీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

ఇది కూడా చదవండి..BP Tablets : బీపీ టాబ్లెట్స్ వాడటం మొదలుపెడితే ఆపివేయకూడదా..? డాక్టర్లు ఏం చెబుతున్నారు..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.