World Lung Cancer Day 2025: ఆహారపు అలవాట్లు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా..?
సాక్షి లైఫ్ : ప్రస్తుత బిజీ జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. దీనివల్ల అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వాటిలో ఒకటి. ఆహారపు అలవాట్లు సరైనవి లేకపోవడం వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని వైద్యులు అంటున్నారు. ఎలాంటి అలవాట్లు ఈ సమస్యను మరింతగా పెంచుతాయి..? అందుకోసం ఇలాంటివాటిని నివారించాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి..?
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..
ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2025, ఆగస్టు 1న ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తారు.
సిగరెట్లు లేదా పొల్యూషన్ వల్ల మాత్రమే ఊపిరితిత్తులు దెబ్బతింటాయని అనుకుంటారు. కానీ ఇవి మాత్రమే కావు అందుకు ప్రధాన కారణాలు మరికొన్ని ఉన్నాయి. నేటి కాలంలో మన అలవాట్లలో కొన్ని, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత తరంలో తినే విధానం, తాగే విధానం కూడా చాలా మారిపోయింది.
వేగవంతమైన జీవితంలో, ప్రజలు త్వరగా, సులభంగా అందుబాటులో ఉన్న వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఊపిరితిత్తులు కూడా క్రమంగా బలహీనపడటం ప్రారంభిస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆహారంలో చేయవలసినవి, చేయకూడనివి ఉన్నాయి.. అవేంటంటే..?
అధిక గ్లైసెమిక్ ఆహారాలు, వేయించిన పదార్థాలు, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు, అదనపు చక్కెర తినడం వల్ల ఊపిరితిత్తుల కణాలలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుందని, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ట్రాన్స్ ఫ్యాట్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, మార్కెట్లో లభించే నమ్కీన్, కేకులు, బిస్కెట్లు, ప్యాక్ చేసిన స్నాక్స్, శీతల పానీయాల వంటి ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉన్న ఆహారాలను ఆహారంలో చేర్చడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది క్యాన్సర్ కణాలను పెంచుతుంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
