CBC Blood Test Report : సీబీసీ రిపోర్ట్ చూసి కంగారు పడుతున్నారా..? ఈ 3 విలువలతో లోపాలను గుర్తించవచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు డాక్టర్లు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోమని సూచిస్తారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారం, జీవనశైలితో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు వైద్యులు సాధారణంగా సూచించే మొదటి రక్త పరీక్ష 'సీబీసీ' (Complete Blood Count). దీని ద్వారా రక్తంలోని హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు,ప్లేట్‌లెట్ల స్థితిని అంచనా వేస్తారు.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 

అయితే, సీబీసీ రిపోర్టులో ఉండే MCV, MCH, RDW వంటి సంక్షిప్త పదాలను చూసి చాలామంది అయోమయానికి గురవుతుంటారు. వాటి విలువలు సాధారణ స్థాయి కంటే కాస్త అటుఇటుగా ఉంటే ఆందోళన చెందుతారు. నిజానికి, ఈ మూడు అంశాలు మన శరీరంలోని ఎర్ర రక్త కణాల (RBC) పరిమాణం, వాటిలో ఉండే హిమోగ్లోబిన్ స్థాయి, కణాల ఆకృతిలో వచ్చే మార్పులను సూచిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సీబీసీ రిపోర్టులో ఈ మూడింటి అర్థమేమిటి..?

ఎంసీవీ (MCV - Mean Corpuscular Volume)..

 

ఇది ఎర్ర రక్త కణాల సగటు పరిమాణాన్ని (size) తెలియజేస్తుంది. రక్త పరీక్షలో ఎంసీవీ విలువ సాధారణం కంటే తక్కువగా ఉంటే, శరీరంలో ఐరన్ లోపం లేదా థలసీమియా వంటి సమస్యలకు సంకేతం కావచ్చు. ఒకవేళ ఈ విలువ ఎక్కువగా ఉంటే విటమిన్ బి12, ఫోలేట్ లోపం, కాలేయ సంబంధిత సమస్యలు లేదా హైపోథైరాయిడిజం ఉండే అవకాశం ఉంది.

ఎంసీహెచ్ / ఎంసీహెచ్‌సీ (MCH / MCHC).. ఒక ఎర్ర రక్త కణంలో సగటున ఎంత మోతాదులో హిమోగ్లోబిన్ ఉందో ఇది వివరిస్తుంది. సాధారణంగా దీని స్థాయి 32 నుంచి 36 g/dL మధ్య ఉంటుంది. ఈ విలువ తగ్గితే ఐరన్ లోపంతో కూడిన రక్తహీనత (anemia) ఉన్నట్లు భావిస్తారు. అదే విలువ పెరిగితే డీహైడ్రేషన్ లేదా ఇతర రక్త సంబంధిత రుగ్మతలు కారణం కావొచ్చు.

ఆర్‌డీడబ్ల్యూ (RDW - Red Cell Distribution Width)..

 

రక్తంలోని ఎర్ర రక్త కణాల పరిమాణంలో ఉన్న వ్యత్యాసాన్ని ఇది కొలుస్తుంది. పెద్దవారిలో దీని సాధారణ స్థాయి 11.5% నుంచి 16.1% మధ్య ఉంటుంది. ఆర్‌డీడబ్ల్యూ విలువ పెరిగిందంటే, రక్తంలో వివిధ పరిమాణాల్లో ఎర్ర రక్త కణాలు ఉన్నాయని అర్థం. ఇది ప్రధానంగా ఐరన్, విటమిన్ బి12 లేదా ఫోలేట్ లోపాలను సూచిస్తుంది.

 
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎంసీవీ విలువ తక్కువగా ఉండి, ఆర్‌డీడబ్ల్యూ ఎక్కువగా ఉంటే ఐరన్ లోపం ఉండే అవకాశాలు ఎక్కువ. అలాగే, ఎంసీవీ, ఆర్‌డీడబ్ల్యూ రెండూ ఎక్కువగా ఉంటే విటమిన్ బి12 లేదా ఫోలేట్ లోపం ఉన్నట్లు అనుమానిస్తారు. సీబీసీ రిపోర్టులో కనిపించే ఈ మార్పులను బట్టి, ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించుకోవడానికి వైద్యులు ఐరన్ ప్రొఫైల్, ఫెర్రిటిన్ లేదా విటమిన్ బి12 పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. కాబట్టి రిపోర్టులోని అంకెలను చూసి సొంతంగా నిర్ధారణకు రాకుండా వైద్యులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.