ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? ఆగండి..!   

సాక్షి లైఫ్: ఎనర్జీ డ్రింక్స్‌లో 80 నుంచి 300 ఎంజీ వరకూ కెఫిన్ ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఇది ఒక 8 ఔన్సుల కప్పు కాఫీలో 100 ఎంజీ కెఫిన్ కలిగి ఉంటుంది. కెఫిన్‌తో పాటు, టౌరిన్, గ్వారానా వంటి అదనపు ఉత్ప్రేరకాలు ఎనర్జీ డ్రింక్స్ లో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అకస్మాత్తుగా గుండెపోటుతో బయటపడిన సుమారు 144 మందికి ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో 7 మంది, సుమారు 5 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఎనర్జీ డ్రింక్స్ తాగారని వెల్లడైంది.

ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?

ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి.. కడల్ హార్మోన్ అంటే ఏమిటి..?

తక్షణ శక్తి కోసం చాలామంది వివిధ రకాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం ద్వారా తక్షణ శక్తి లభిస్తుంది. కానీ దానివల్ల తలెత్తే అనర్థాలు చాలానే ఉన్నాయి. ఇన్స్టంట్ ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుందని, ఇది 'హార్ట్ అరిథ్మియా' ప్రమాదాన్ని పెంచుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 

కార్డియాక్ అరిథ్మియా..?
 
కార్డియాక్ అరిథ్మియా అనేది క్రమరహిత హృదయ స్పందనకు సంబంధించిన పరిస్థితి. ఈ సమస్య తలెత్తినవారికి హృదయ స్పందనలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుందని, దీని కారణంగా, హృదయ స్పందన రేటు గణనీయంగా పెరుగుతుంది. తద్వారా శరీరంలో రక్తపోటు తీవ్రమవుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

పరిశోధనలో ఏం తేలిందంటే..?

ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే స్వీట్స్ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయని ఒక పరిశోధనలో తేలింది. ఇది క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని సైతం తగ్గిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులతోపాటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఇది కూడా చదవండి.. జీవనశైలి, ఆహారం హోమియోపతి చికిత్సల ప్రభావాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

ఇది కూడా చదవండి.. హోమియోపతి చికిత్స ద్వారా ఎలాంటి వ్యాధులు తొందరగా నయమవుతాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : energy-drink energy-drink-side-effects side-effects-of-energy-drink energy-drinks are-energy-drinks-bad-for-you energy-drinks-bad-for-you are-energy-drinks-bad-for-your-health energy-drinks-side-effects monster-energy-drink energy-drinks-dangerous are-energy-drinks-bad are-energy-drinks-safe benefits-of-energy-drinks 5-hour-energy-drink danger-of-energy-drinks facts-about-energy-drinks energy-drinks-health-risk what-drinking-energy-drinks-every-day-does-to-your-body effects-of-energy-drinks-on-the-body

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com