Health care : కేఎఫ్‌టీ టెస్ట్ (KFT test ) అంటే ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీల (Kidneys) పాత్ర అత్యంత కీలకం. శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్స్, రసాయన సమతుల్యతను కాపాడేది ఇవే. అయితే కిడ్నీ వ్యాధులకు సంబంధించిన లక్షణాలు ప్రారంభ దశలో అంత సులభంగా బయటపడవు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వైద్యులు 'కిడ్నీ ఫంక్షన్ టెస్ట్' (KFT) చేయించుకోవాలని సూచిస్తుంటారు.

 

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

 

కేఎఫ్‌టీ (KFT) అంటే ఏమిటి..?

కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT) ద్వారా మూత్రపిండాల పనితీరును, వాటి వడపోత సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఇందులో ప్రధానంగా రక్త పరీక్ష, అవసరాన్ని బట్టి మూత్ర పరీక్ష చేస్తారు. సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా నైట్రోజన్, ఈజీఎఫ్ఆర్ (eGFR) లాంటివి పరిశీలిస్తారు. కండరాల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థమే ఈ క్రియాటినిన్. కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గినప్పుడు రక్తంలో దీని స్థాయి పెరుగుతుంది. క్రియాటినిన్ స్థాయిల ఆధారంగా కిడ్నీల వడపోత రేటును (eGFR) గణిస్తారు.

ఈ పరీక్ష ద్వారా ఏం తెలుస్తుంది..?

ఈజీఎఫ్ఆర్ (eGFR)..కిడ్నీలు రక్తాన్ని ఎంత బాగా ఫిల్టర్ చేస్తున్నాయో ఇది తెలుపుతుంది. eGFR స్కోర్ 60 కంటే తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు ఉన్నట్లుగా భావించాలి. యూఏసీఆర్ (UACR)..యూరిన్ ఆల్బుమిన్-క్రియాటినిన్ రేషియో ద్వారా కిడ్నీల నుంచి ప్రోటీన్ లీక్ అవుతోందా అనేది తెలుస్తుంది. ఆరోగ్యకరమైన కిడ్నీలు ఆల్బుమిన్‌ అనే ప్రోటీన్‌ను మూత్రంలోకి వెళ్లనివ్వవు. UACR 30 mg/g కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీలు దెబ్బతిన్నాయని అర్థం.

ఎవరెవరు ఈ పరీక్ష చేయించుకోవాలి..?

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ప్రతి 1 లేదా 2 ఏళ్లకు ఒకసారి కేఎఫ్‌టీ చేయించుకోవడం ఉత్తమం. మధుమేహం (diabetes), అధిక రక్తపోటు (hypertension), గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ప్రతి 6 నెలలకోసారి తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాలి. పెరిగిన షుగర్, బీపీ స్థాయిలు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కుటుంబంలో కిడ్నీ వ్యాధుల చరిత్ర లేదా కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు ఉన్నవారు కూడా క్రమం తప్పకుండా వైద్యుల సలహాతో కేఎఫ్‌టీ, యూరిన్ టెస్టులు చేయించుకోవాలి. సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన చికిత్సతో వాటిని నయం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.