Painkillers: పెయిన్ కిల్లర్స్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే..?
సాక్షి లైఫ్ : తలనొప్పి, నడుంనొప్పి లేదా పంటినొప్పి రాగానే చాలామంది వెంటనే పెయిన్ కిల్లర్ (painkiller) వేసుకుంటారు. డాక్టర్ల సలహా లేకుండా ఇలా పదే పదే మందులు వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తాత్కాలిక ఉపశమనం కోసం వాడే ఈ మందులు, దీర్ఘకాలంలో శరీరంలోని ముఖ్య అవయవాలపై తీవ్ర దుష్ప్రభావాలను చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్..
ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫుడ్..?
ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..
జీర్ణాశయంపై దుష్ప్రభావం..
నొప్పి నివారణ మాత్రలను ఎక్కువగా వాడటం వల్ల కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. పరిమితికి మించి వాడటం వల్ల కొన్నిసార్లు జీర్ణాశయం, పేగుల్లో అల్సర్లు ఏర్పడి అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. మందులు వేసుకున్న తర్వాత మలవిసర్జన నల్లగా రావడం లేదా రక్తపు వాంతులు లాంటివి జరిగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కిడ్నీలు, కాలేయానికి ముప్పు..
ఎక్కువగా 'నాన్-స్టెరాయిడల్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ' (NSAIDs) మందులు వాడటం వల్ల మూత్రపిండాల (kidneys) పనితీరు మందగిస్తుంది.కాలేయం దెబ్బతింటుంది.. జ్వరం, నొప్పుల కోసం సాధారణంగా వాడే పారాసెటమాల్ లాంటి మందులు మోతాదు మించితే కాలేయం (liver) కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. శరీరంలో నీటిశాతం తక్కువగా ఉన్నప్పుడు ఈ మందులు వాడితే కిడ్నీలపై మరింత ఒత్తిడి పడుతుంది.
అసలు సమస్యకు ముసుగు..
పెయిన్ కిల్లర్స్ కేవలం నొప్పిని మాత్రమే తాత్కాలికంగా తగ్గిస్తాయి, కానీ ఆ నొప్పికి గల అసలు కారణాన్ని నయం చేయవు. పదే పదే నొప్పులు వస్తుంటే అది వేరే ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. మందులతో నొప్పిని అణిచివేయడం వల్ల అసలు వ్యాధి ముదిరే ప్రమాదం ఉంది.
తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు..
ఎల్లప్పుడూ డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే మందులు వేసుకోవాలి. సొంత వైద్యం ప్రమాదకరం. గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఈ మందులు ఇచ్చేటప్పుడు వైద్యుల సూచనలు తప్పనిసరి. ముందుగానే గుండె, లివర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రక్తం పల్చబడే మందులు వాడేవారు పెయిన్ కిల్లర్స్ వాడకంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మందు వేసుకున్నా నొప్పి తగ్గకపోయినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా చర్మంపై అలెర్జీలు వచ్చినా తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి.
ఇది కూడా చదవండి..ప్రపంచంలోనే తొలిసారిగా గొర్రెలో బర్డ్ ఫ్లూ..
ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
