సాక్షి లైఫ్ : స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల కేవలం బరువు తగ్గడం సాధ్యం కాదు. కానీ కొన్ని కారణాల వల్ల స్పైసీ ఫుడ్స్ కొన్ని ప్రామాణిక ప్రయోజనాలు కలిగి ఉండవచ్చు.. మిరపకాయలు, కారం వంటి పదార్థాలు మెటబాలిజాన్ని పెంచే గుణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో కాలరీలను వేగంగా బర్న్ అవ్వడానికి సహాయపడుతాయి.
ఆహారం రుచిని పెంచడంలో కారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కూరల రుచిని పెంచడమేకాదు కానీ శరీరంలో మెటబాలిజాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా..? అవును ఇది నిజం. మసాలా ఆహారాలు మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. స్పైసీ ఫుడ్స్ కేలరీలను బర్న్ చేయడానికి , బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి.