స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల బరువు తగ్గుతారా..?
సాక్షి లైఫ్ : ఆహారం రుచిని పెంచడంలో కారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కూరల రుచిని పెంచడమేకాదు కానీ శరీరంలో మెటబాలిజాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా..? అవును ఇది నిజం. మసాలా ఆహారాలు మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. స్పైసీ ఫుడ్స్ కేలరీలను బర్న్ చేయడానికి , బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి.
ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?
ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?
స్పైసీ ఫుడ్స్‌లోని క్యాప్సైసిన్ నోటిలో హీట్ సెన్సింగ్ బడ్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. శరీరం వేగంగా చెమటలు పట్టడం, మండే అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. స్పైసీ ఫుడ్ ఆకలిని తగ్గిస్తుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
క్యాప్సైసిన్ కేలరీలను బర్న్ చేయడమే కాకుండా కొవ్వును కూడా విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ప్రక్రియను లిపోలిసిస్ అంటారు. క్యాప్సైసిన్ థర్మోజెనిసిస్‌ను పెంచుతుంది. దీని వల్ల శరీరం త్వరగా వేడెక్కుతుంది. జీవక్రియను పెంచుతుంది. ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
