సైనసైటిస్ సమస్యలు తలెత్తడానికి కారణాలు- పరిష్కార మార్గాలు.. 

సాక్షి లైఫ్ : సైనస్ అనేది ముక్కుకు సంబంధించిన వ్యాధి. సైనస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు దీనికారణంగా ముఖ కండరాలలో నొప్పిగాకూడా అనిపిస్తుంది. "సైనస్‌"ని "సైనసైటిస్" అని , "రైనోసైనసిటిస్" అని కూడా అంటారు. బాక్టీరియా, ఫంగల్, ఇన్ఫెక్షన్, అలెర్జీలు, ముక్కు కండ పెరగడం జరుగుతుంది. ఆస్తమా వల్ల సైనస్ సమస్యలు వస్తాయి. 

సైనసైటిస్ ఎందుకు వస్తుంది..?  లక్షణాలు ఎలా ఉంటాయి..?  
 
సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా కణజాలాల వాపు వస్తుంది. అంతేకాకుండా ముక్కులోపల నొప్పి, ముక్కు మూసుకుపోవడం లేదా ముక్కు కారటం, కొన్నిసార్లు జ్వరం రావడం కూడా జరుగుతుంది. ఇది జలుబు చేసిన సమయంలో మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్, అలర్జీలు సైనసైటిస్‌కు కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇన్ఫెక్షన్, అలెర్జీలు, జలుబు, కెమికల్ ఇరిటేషన్ కారణంగా సైనస్ సంభవిస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖం వాపు, జ్వరం,చెవులు, దంతాలనొప్పి, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, గొంతు మంట వంటి లక్షణాలు కనిపిస్తే "సైనసైటిస్" గా పరిగణిస్తారు. 

ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  

తగిన విశ్రాంతి.. 

ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల సైనస్ సమస్య తీవ్రమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సైనస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.


ఆవిరి పట్టడం వల్ల ఉపశమనం.. 

సైనస్ సమస్య ఉన్నవారికి తరచుగా ముక్కు కారుతున్న సమయంలో  ఆవిరి తీసుకోవడం వల్ల కొంతమేర ఉపశమనం కలుగుతుంది. నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపించినా కూడా ఆవిరి పట్టడంవల్ల సమస్య తాత్కాలికంగా కొంత వరకు పరిష్కారం అవుతుంది.   

 
చల్లని పానీయాలు అస్సలు తీసుకోకూడదు. వేడి పానీయాలు మాత్రమే తీసుకోవడం ఉత్తమం. సైనస్ సమస్య ఉంటే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. హాట్ వాటర్ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుంది.  

మద్యం సేవించడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా మద్యం తీసుకోకపోవడం మంచిది. చల్లని గాలి, చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు చల్లని నీటితో కూడా తలస్నానం చేయవద్దని వారు చెబుతున్నారు. 


సైనసైటిస్ అంటువ్యాధా..?

సైనసైటిస్ అంటువ్యాధి కాదు. కానీ దానికి కారణమయ్యే వైరస్లు , బ్యాక్టీరియా లతోనే సైనసైటిస్ సమస్య తలెత్తుతుంది. పరిశుభ్రతను పాటించాలి. చేతులు, ముక్కు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

సైనసైటిస్ చికిత్స చేయకుండా వదిలేస్తే ఏమి జరుగుతుంది..?

సైనసైటిస్ విషయంలో అవసరమైన టెస్టులు చేయించి చికిత్స తీసుకోవాలి. సమస్య పెద్దది కాకుండానే చికిత్స చేయించుకుంటే మంచిదని, ఒకవేళ చికిత్స తీసుకోవడంలో మరింత ఆలస్యం జరిగితే  సైనస్ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.  


సైనసైటిస్‌ని నిర్ధారించడానికి ప్రత్యేక పరీక్షలు.. 
 
నాజల్ ఎండోస్కోపీ
కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కాన్‌ 
అలెర్జీ  టెస్ట్..
 బయాప్సి టెస్టు.. 

సైనసైటిస్‌కు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. లక్షణాలతో పాటుఎంతకాలంగా ఆ సమస్య ఉంది..? అనే దానిపై ఆధారపడి చికిత్స  చేస్తారు.  
 
సైనస్ ఇన్ఫెక్షన్ లో రకాలు.. ?

 సైనస్ ఇన్ఫెక్షన్ రకం అది ఎంతకాలం నుంచి ఉంది..? తరచుగా వస్తుందా..? అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అక్యూట్ సైనస్: అమెరికన్ అకాడమీ ఆఫ్ ఒటోలారిన్జాలజీ ప్రకారం, ఈ రకమైన సైనస్ ఇన్ఫెక్షన్ 4 వారాల కంటే తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా జలుబు లేదా ఇతర శ్వాసకోశ అనారోగ్యంలో భాగంగా పరిగణిస్తారు.  

సబాక్యూట్ సైనసైటిస్‌: సబాక్యూట్ సైనస్ ఇన్ఫెక్షన్ 4 నుంచి 12 వారాల మధ్య ఉంటుంది.

రికరెంట్ అక్యూట్ సైనసైటిస్‌ : ఇన్ఫెక్షన్ ఒక సంవత్సరంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తిరిగి వచ్చినట్లయితే, ప్రతి ఇన్ఫెక్షన్ 7 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటే, తీవ్రమైన సైనస్ ఇన్ఫెక్షన్ ను రికరెంట్ అక్యూట్ సైనసైటిస్‌గా పరిగణిస్తారు.

క్రానిక్ సైనసైటిస్‌: క్రానిక్ సైనస్ ఇన్ఫెక్షన్లు 12 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయి. లేదా పునరావృతమవుతూ ఉంటాయి.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : sinusitis-problems
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com