సాక్షి లైఫ్ : ప్రస్తుత తరం హడావుడి జీవితంలో కెరీర్, సౌకర్యాల వెనుక పరుగెడుతూ అత్యంత విలువైన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవలి కాలంలో 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల వారిలో జీవనశైలి వ్యాధులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా ఉండాల్సిన ఈ వయసులో యువత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
యువతను వేధిస్తున్న ప్రధాన సమస్యలు..
మధుమేహం, ఊబకాయం.. అధిక బరువుతో పాటు రక్తం లో చక్కెర స్థాయిని సూచించే HbA1C పెరగడం యువతలో సాధారణమై పోయింది. పోషకాహార లోపం, విటమిన్-బి12, విటమిన్-డి స్థాయిలు పడిపోవడం ప్రధాన సమస్యగా మారింది. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, రక్తపోటు (BP)హోమోసిస్టీన్ స్థాయిలు గుండె ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించాయి. గంటల తరబడి తప్పుడు పద్ధతిలో కూర్చోవడం వల్ల వెన్నెముక సమస్యలు (Disc Prolapse), మెడ, నడుము నొప్పులు అధికమవుతున్నాయి.
అనారోగ్యానికి కారణాలేమిటి..?
30 నుంచి 40 ఏళ్లలోనే దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి మన అలవాట్లే కారణమని వైద్యులు చెబుతున్నారు. రోజులో 10 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేకపోవడం. బయట దొరికే జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం. రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం, మితిమీరిన మానసిక ఒత్తిడి. ధూమపానం, మద్యం అలవాట్లు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?
యువత తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పలు మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర, వ్యాయామం.. ప్రతిరోజూ కనీసం 7 గంటల నిద్ర, 30 నిమిషాల వ్యాయామం ఏరోబిక్స్, స్ట్రెంత్ ట్రైనింగ్ తప్పనిసరి. ఆఫీసులో నిరంతరం కూర్చోకుండా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం తీసుకుని అటు ఇటు నడవాలి. కార్బోహైడ్రేట్లు తగ్గించి, ప్రోటీన్ పెంచాలి. పంచదార, స్వీట్లు, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఏదైనా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఏడాదికి ఒకసారి ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com