Natural Food : ఖర్జూరం: శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలను అందించే సహజ ఆహారం.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రకృతి మనకు ఎన్నోరకాల పండ్లు, కాయలు పాసాదిస్తోంది. అటువంటివాటిలో కొన్నింటిలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అలాంటి పండ్లలో ఒకటి ఖర్జూరం. తీపి రుచితో నోరూరించే ఖర్జూరం కేవలం చక్కెరకు మాత్రమే ప్రత్యామ్నాయం కాదు. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలను అందించే సహజ ఆహారమిది. అందుకే పోషకాహార నిపుణులు దీన్ని 'సూపర్ ఫుడ్'గా పేర్కొంటారు. అయితే ఏ సమయంలో తింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ఉదయం ఖాళీ కడుపుతో.. 

పొద్దున్నే పరగడుపున రెండు, మూడు ఖర్జూరాలు తింటే రోజును ఉత్సాహంగా మొదలుపెట్టవచ్చు. వీటిలోని సహజ చక్కెరలు వెంటనే శక్తినిచ్చి, నీరసాన్ని దూరం చేస్తాయి. ఇందులోని పీచు పదార్థం జీర్ణక్రియను చురుగ్గా ఉంచి, మలబద్ధకం సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఐరన్ కూడా అధికంగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగడానికి సహాయపడుతుంది.

వ్యాయామానికి ముందు..

కసరత్తు చేసేవారికి ఖర్జూరం చక్కని ఎంపిక. వ్యాయామానికి సుమారు అరగంట ముందు తీసుకుంటే శరీరానికి తగినంత శక్తి అంది, త్వరగా అలసిపోకుండా ఉంటారు. అంతేకాదు, ఇందులోని పోషకాలు కండరాల పటుత్వానికి కూడా దోహదం చేస్తాయి.

సాయంత్రం స్నాక్‌గా..

సాయంత్రం వేళ చిరుతిళ్ల కోసం నూనెలో వేయించిన పదార్థాలు, తీపి వంటకాల వైపు మనసు లాగుతుంది. వాటికి బదులు కొన్ని ఖర్జూరాలు తింటే ఆకలి తీరి, కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అనవసరమైన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండవచ్చు.

రాత్రి పడుకునే ముందు..

నిద్రకు ముందు గోరువెచ్చని పాలతో కలిపి ఖర్జూరం తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుందని చెబుతారు. పాలలోని పోషకాలు, ఖర్జూరంలోని శక్తి కలిసి శరీరానికి కావాల్సిన పోషణను అందిస్తాయి.

 ఆరోగ్య ప్రయోజనాలు..

సరైన మోతాదులో క్రమం తప్పకుండా తీసుకుంటే ఖర్జూరం వల్ల ఈ లాభాలు కలుగుతాయి.

తక్షణ శక్తి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది
ఎముకలు దృఢంగా మారతాయి. 
గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది
రక్తహీనత ముప్పు తగ్గుతుంది
చర్మం, కురులు కాంతివంతంగా ఉంటాయి..

గుర్తుంచుకోవాల్సినవి..

ఖర్జూరం ఆరోగ్యకరమైనదే అయినా, దీనిలో సహజ చక్కెరలు ఎక్కువే. కాబట్టి రోజుకు కొన్ని పండ్లకే పరిమితం కావడం మంచిది. మధుమేహం ఉన్నవారు, బరువు నియంత్రణలో ఉన్నవారు తమ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యులను లేదా డైటీషియన్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.