Dengue and Platelet Drop : డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల క్షీణతకు ప్రధాన కారణాలు ఇవే.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారతదేశంలో వర్షాకాలం ఆరంభంతోనే దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ముప్పు ముంచుకొస్తోంది. ఏటా వేలాది మందిని ఆసుపత్రి పాలు చేస్తూ, ప్రాణాంతకంగా మారుతున్న వ్యాధుల్లో డెంగ్యూ అగ్రస్థానంలో ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా అధికారికంగా 1.21 లక్షలకు పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, 131 మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి డెంగ్యూ పట్ల ప్రజల్లో అవగాహన ఎంతైనా అవసరం..

డెంగ్యూను కేవలం సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రాణాల మీదకు వస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు డెంగ్యూ ఎందుకు ప్రమాదకరంగా మారుతుంది..? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదో ఇప్పుడు చూద్దాం..

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ప్లేట్‌లెట్ల క్షీణత..ప్రధాన ముప్పు..

డెంగ్యూ బారిన పడినప్పుడు అందరినీ భయపెట్టే అంశం రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం. సాధారణంగా మానవ శరీరంలో ఒక మైక్రోలీటర్ రక్తానికి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ప్లేట్‌లెట్లు ఉండాలి. ఇవి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. అయితే, డెంగ్యూ వైరస్ నేరుగా ఎముక మజ్జ (Bone Marrow)పై ప్రభావం చూపడం వల్ల ప్లేట్‌లెట్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఇవి మరీ తక్కువ స్థాయికి పడిపోయినప్పుడు ముక్కు, చిగుళ్లు లేదా మలం ద్వారా అంతర్గత రక్తస్రావం (Internal Bleeding) మొదలవుతుంది.

ప్రాణాంతక స్థితి.. హెమరేజిక్ ఫీవర్, షాక్ సిండ్రోమ్..


డెంగ్యూ జ్వరం ముదిరితే అది రెండు రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ (DHF).. ఈ స్థితిలో రక్తనాళాలు బలహీనపడి, వాటి నుంచి ప్లాస్మా ద్రవం బయటకు లీక్ అవుతుంది. ఫలితంగా విపరీతమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులు, అంతర్గత రక్తస్రావం జరుగుతుంది.

డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DSS).. ప్లాస్మా లీకేజీ అధికమcross అయినప్పుడు శరీరంలో రక్తపోటు (BP) ఒక్కసారిగా పడిపోతుంది. దీనివల్ల రోగి చేతులు, కాళ్లు చల్లబడిపోవడం, తీవ్రమైన ఆందోళన చెందడం,స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఇది అత్యవసర వైద్య పరిస్థితి.

రెండోసారి వస్తే మరింత ప్రమాదం..!

ఒకసారి డెంగ్యూ వచ్చి తగ్గిన వారికి, రెండోసారి వేరే స్ట్రెయిన్ ద్వారా డెంగ్యూ సోకితే అది మునుపటి కంటే అత్యంత తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి గతంలో డెంగ్యూ వచ్చిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలి.

ప్రమాదాన్ని పెంచే ఇతర కారకాలు..

దీర్ఘకాలిక వ్యాధులు: మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ, కాలేయ సమస్యలు ఉన్నవారికి డెంగ్యూ సోకితే పరిస్థితి త్వరగా విషమిస్తుంది. వయసు..చిన్న పిల్లలు, వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

డీహైడ్రేషన్.. జ్వరం, వాంతుల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం సమస్యను మరింత జటిలం చేస్తుంది. వర్షాకాలంలో జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే స్వయం వైద్యం జోలికి పోకుండా, వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం సురక్షితం. ఆలస్యంగా గుర్తించడమే డెంగ్యూ మరణాలకు ప్రధాన కారణమని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.