The Secret of the Spine : వెన్నెముకలోని ఆ సీక్రెటే హైట్ పెరుగుదల, తగ్గుదలకు కారణం..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనుషుల ఎత్తు అనగానే మనమంతా ఒక వయసు వచ్చాక అది స్థిరంగా ఉండిపోతుందని భావిస్తాం. కానీ, సైన్స్ నిపుణులు వెల్లడించిన తాజా వాస్తవాలు ఈ నమ్మకాలను పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. మనం ఉదయం నిద్రలేచినప్పుడు ఉండే ఎత్తు.. రాత్రి పడుకునే సమయానికి ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒక వ్యక్తి ఎత్తులో దాదాపు 1 నుంచి 2 సెంటీమీటర్ల మేర వ్యత్యాసం వస్తుందనే నిజం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మన శరీర నిర్మాణంలో, ముఖ్యంగా వెన్నెముకలో జరిగే ఒక సహజసిద్ధమైన ప్రక్రియే దీనికి కారణం.. 

 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

వెన్నెముకలోనే అసలు రహస్యం,,

మనం రోజూ పొడవుగా, పొట్టిగా మారడానికి గల అసలు కారణం మన వెన్నెముకలోనే దాగి ఉంది. మానవ వెన్నెముక అనేది ‘వర్టెబ్రే’ (Vertebrae) అని పిలిచే చిన్న చిన్న ఎముకల గొలుసుతో నిర్మితమవుతుంది. ఈ ఎముకల మధ్యలో ‘ఇంటర్ వర్టెబ్రల్ డిస్క్‌లు’ (Intervertebral discs) అని పిలిచే మృదువైన, కుషన్ వంటి నిర్మాణాలు ఉంటాయి. జెల్ లాంటి ద్రవంతో నిండి ఉండే ఈ డిస్క్‌లు, మన వెన్నెముకకు ‘షాక్ అబ్జార్బర్లు’గా పనిచేస్తూ మనం వంగడానికి, నడవడానికి అవసరమైన ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయి.

గురుత్వాకర్షణ ప్రభావంతో..

ఉదయం నుంచి రాత్రి వరకు మనం నిలబడటం, నడవడం, కూర్చోవడం వంటి పనులు చేస్తున్నప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తి (Gravity) నిరంతరం మన శరీరాన్ని కిందికి లాగుతుంటుంది. దీనివల్ల శరీర బరువంతా వెన్నెముకపై పడుతుంది. ఈ నిరంతర ఒత్తిడి కారణంగా, వెన్నెముక పూసల మధ్య ఉండే మృదువైన డిస్క్‌లలోని జెల్ లాంటి ద్రవం కొద్దికొద్దిగా బయటకు నెట్టబడుతుంది. ఫలితంగా ఆ డిస్క్‌లు పల్చగా మారి, వెన్నెముక పొడవు స్వల్పంగా తగ్గుతుంది. అందుకే ఉదయం ఉన్న ఎత్తుతో పోలిస్తే, సూర్యాస్తమయం అయ్యేసరికి మనిషి స్వల్పంగా పొట్టిగా మారతాడు.

రాత్రి వేళల్లో రీఛార్జ్ (Spinal Decompression)..  

పగటిపూట తగ్గిన ఈ ఎత్తు శాశ్వతం కాదు. రాత్రి వేళల్లో పడకపై విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వెన్నెముకపై ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. ఈ సమయంలో ఆ డిస్క్‌లు తిరిగి ద్రవాన్ని పీల్చుకుని, మళ్లీ తమ పాత రూపాన్ని, మందాన్ని సంతరించుకుంటాయి. దీనివల్ల ఉదయానికల్లా కోల్పోయిన ఎత్తు తిరిగి వచ్చేస్తుంది.

అంతరిక్షంలో వ్యోమగాముల ఎత్తు ఎంత పెరుగుతుందంటే..?

సాధారణంగా భూమిపై ఒక రోజులో మనిషి ఎత్తులో వచ్చే 1 నుంచి 2 సెంటీమీటర్ల మార్పు చాలా స్వల్పం కాబట్టి మనం నిత్య జీవితంలో దీనిని గమనించలేం. కానీ అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములలో ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు (Zero Gravity) కాబట్టి, అక్కడ వ్యోమగాముల వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడి పడదు. ఫలితంగా వారి వెన్నెముక స్వేచ్ఛగా సాగి, భూమిపై ఉన్నప్పటి కంటే వారు అక్కడ దాదాపు రెండు ఇంచుల వరకు పొడవు పెరుగుతారని పరిశోధనలు నిరూపించాయి.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.