బొప్పాయి తింటే శరీరానికి వేడి చేస్తుందా..? ఎంతవరకు వాస్తవం..?  

 
సాక్షి లైఫ్ : ప్రతిరోజూ మనం తినే ఆహారపదార్థాల్లో కొన్ని శరీరానికి చలువ చేసేవి.. మరికొన్ని వేడి చేసే ఆహారపదార్థాలు ఉంటాయి. చలువ చేసే పదార్థాలు, వేడి చేసే పదార్థాలకు సంబంధించి చాలా మందికి అపోహలు, అనుమానాలు ఉంటాయి. 

అలాంటి వాటిలో బొప్పాయి తినడం వల్ల ఒంట్లో విపరీతంగా వేడి పెరుగుతుందని చెబుతుంటారు. ఐతే ఇది ఎంతమాత్రం నిజంగా కాదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు మామిడి పండ్లు,గోధుమ పిండితో చేసిన ప‌దార్థాలు, తేనె, గోంగూర, ఆవ‌కాయ వంటివి తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి పెరుగుతుందని అంటుంటారు. 

ఇది ఏమాత్రం వాస్తవం కాదు.. అసలు ఒంటికి చలువ చేసే ఆహార పదార్థాలు, వేడి చేసే పదార్థాలనేవి ఉంటాయా..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. 

 వేస‌వి కాలంలో ప్రతిఒక్కరూ ఖచ్చితంగా ఎదుర్కొనే సమస్యశ‌రీరంలో వేడి. అయితే కొంతమంది గోధుమ పిండితో చేసిన ప‌దార్థాలు, తేనె, మామిడి పండ్లు, బొప్పాయి, గోంగూర, ఆవ‌కాయ వంటివి తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి చేస్తుందని అంటుంటారు. కానీ ఇది అంతా అవాస్తవ‌ మ‌ని వైద్యనిపుణులు కొట్టి పారేస్తున్నారు.

క‌ణ‌జాలంలో ఉండే నీరు..

మ‌న శ‌రీరంలో నిరంత‌రం క‌ణ‌ జాలం నుంచి శ‌క్తి ఉత్ప‌త్తి అవుతూ ఉంటుంది. శ‌క్తి ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల వ‌చ్చే వేడి శ‌రీరంలో సాధార‌ణంగా 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్ వ‌ర‌కు ఉంటుంది. క‌ణ‌జాలంలో ఉండే నీరు ఈ ఉష్ణోగ్ర‌తను పెరగ‌కుండా, త‌గ్గ‌కుండా నియంత్రిస్తుంది.

 అయితే నీటిని స‌రిగ్గా తాగ‌న‌ప్పుడు క‌ణ‌జాలంలో ఉండే నీటి శాతం త‌గ్గడంవల్ల శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త పెరుగుతుంది. ఈ పరిస్థితినే "వేడి" చేయ‌డం అంటారు. ఆ సమయంలో  క‌ళ్ల మంట‌లు, త‌ల‌నొప్పి, మూత్రంలో మంట‌, శ‌రీరానికి వేడి త‌గిలిన‌ప్పుడు శ‌రీరం మండిన‌ట్టు అనిపించ‌డం, మూత్రం వేడిగా పసుపు రంగులో రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు శ‌రీరంలో వేడి చేసిన‌ప్పుడు సహజంగా కనిపిస్తుంటాయి.

శ‌రీరంలో ఉష్ణోగ్రతలు..

శ‌రీరంలో ఉష్ణోగ్రతలు పెరిగిన‌ప్పుడు ఎక్కువ‌గా పంచ‌దార నీళ్లను, స‌గ్గు బియ్యం పాయ‌సాన్ని, నిమ్మ కాయ నీళ్లను, శీత‌ల పానీయాల‌ను ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. ఇవి నీరు ఎక్కువ‌గా క‌లిగిన ఆహార‌ ప‌దార్థాలు మాత్ర‌మే. కానీ నీరు కాదు. కాబట్టి శ‌రీరంలో వేడి చేసిన‌ప్పుడు వీటిని తాగ‌డం కంటే నీళ్ల‌ను తాగ‌డం వల్లే శ‌రీరంలో వేడి త్వ‌ర‌గా త‌గ్గుతుంది. నీళ్లు చాలా త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యి వెంట‌నే ర‌క్తంలో క‌లుస్తాయి. 

 కాబట్టి నీరు క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వల్ల ఇవి జీర్ణ‌మ‌వ్వ‌టానికి సుమారుగా రెండు గంట‌లకుపైగా స‌మ‌యం ప‌డు తుంది. ఈ ఆహార ప‌దార్థాల‌లో ఉండే నీరు ర‌క్తంలో క‌ల‌వ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. కాబట్టి నీటినే ఎక్కువ‌గా తాగాలి.

మ‌న శ‌రీరానికి 70 శాతం నీళ్లు, 30 శాతం ఆహార ప‌దార్థాలు అవ‌స‌రం అవుతాయి. కాబట్టి రోజుకి క‌నీసం నాలుగు లీట‌ర్ల నీరు తాగాలి. వేస‌వి కాలంలో ఒక రోజుకి క‌నీసం ఐదులీట‌ర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. 

ఇలా తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి చేయ‌దు. వేడి చేసిన వారు లేదా వేడి చేయ‌కుండా ఉండ‌డానికి ఉద‌యం ప‌ర‌గ‌డుపున లీట‌ర్ నుంచి లీట‌రన్నర నీళ్ల‌ను తాగాలి. 

బ్రేక్ ఫాస్ట్.. 

ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసేట‌ప్పుడు నీటిని తాగ‌కుండా బ్రేక్ ఫాస్ట్ చేసిన త‌రువాత ఒక గంట నుంచి మ‌ధ్యాహ్న భోజ‌నానికి మ‌ధ్య‌లో మూడు నుంచి నాలుగు గ్లాసుల నీళ్లను తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తాగిన నీరు వెంట‌నే రక్తంలో క‌లుస్తుంది.

 భోజ‌నం త‌రువాత..

 భోజ‌నం చేసిన త‌రువాత రెండు గంట‌ల నుంచి మ‌ళ్లీ నీటిని తాగ‌డం ప్రారంభించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి త‌గ్గుతుంది. ఇలా నీటిని తాగుతూ ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకున్నా..శ‌రీరంలో వేడి చెయ్య‌దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

Tags :

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com