సాక్షి లైఫ్ : ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్న అనారోగ్యాలకు మన పూర్వీకుల నాటి 'పులియబెట్టిన ఆహారమే' (Fermented Foods) సరైన మందు అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోశ, ఆవకాయ వంటి పదార్థాలు కేవలం రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. సహజ సిద్ధమైన పద్ధతిలో తయారయ్యే ఈ ఆహారంలో ఉండే 'ప్రోబయోటిక్స్' అంటే మంచి బ్యాక్టీరియా.. మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
జీర్ణక్రియకు 'మంచి' బ్యాక్టీరియా తోడు..
పులియబెట్టిన ఆహారంలో ఉండే సూక్ష్మజీవులు జీర్ణవ్యవస్థను శుద్ధి చేస్తాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఆహారం సులభంగా జీర్ణం కావడమే కాకుండా, ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా సంఖ్యను ఇవి పెంచుతాయి.
రోగనిరోధక శక్తికి ఊతం..
మన శరీరంలోని రోగనిరోధక శక్తిలో సుమారు 70 శాతం ప్రేగుల ఆరోగ్యంతోనే ముడిపడి ఉంటుంది. పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రేగులు ఆరోగ్యంగా ఉండి, వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి రోగాలతో పోరాడే శక్తిని ఇవి అందిస్తాయి.
మానసిక ప్రశాంతతకు..
ప్రేగులకు, మెదడుకు మధ్య విడదీయలేని సంబంధం ఉంటుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి, ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికీ వరమే..
బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇవి సరైన ఎంపిక. పులియబెట్టిన ఆహారం తీసుకుంటే జీవక్రియ (Metabolism) మెరుగుపడుతుంది. ఇది ఆకలిని నియంత్రించి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా అతిగా తినే అలవాటు తగ్గి, బరువు అదుపులోకి వస్తుంది.
గుండెకు..
కొలెస్ట్రాల్ నియంత్రణ, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. పులియబెట్టిన పదార్థాల గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు.
డైట్‌లో ఏమేం చేర్చుకోవాలి..? ఎలా చేర్చుకోవాలి..?
రోజువారీ ఆహారంలో కనీసం ఒక పూట పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, దోశ వంటివి చేర్చుకోవచ్చు. అయితే, బయట దొరికే ప్యాకెట్ ఫుడ్స్ కంటే ఇంట్లో తయారు చేసిన తాజా పదార్థాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com