సాక్షి లైఫ్ : ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక.. స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాక.. చెవిలో ఇయర్‌ఫోన్లు లేనిదే యువతకు పొద్దు గడవడం లేదు. గంటల తరబడి పాటలు, గేమింగ్, ఓటీటీ సిరీస్‌లలో మునిగితేలుతున్నారు. అయితే, ఈ అలవాటే వారిని నెమ్మదిగా మూగ ప్రపంచంలోకి నెట్టేస్తోందని ఈఎన్‌టీ (ENT) నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే వినికిడి సమస్యలు.. ఇప్పుడు 20 ఏళ్ల యువతలోనూ కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 3వ తేదీన వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దంతో..
మన చెవి లోపలి భాగంలో అత్యంత సున్నితమైన 'హెయిర్ సెల్స్' ఉంటాయి. మనం నిరంతరం 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దంతో ఇయర్‌ఫోన్లు వాడితే, ఆ సెల్స్ శాశ్వతంగా దెబ్బతింటాయి. ఒక్కసారి వినికిడి నరాలు పాడైతే, వాటిని తిరిగి బాగు చేయడం వైద్యశాస్త్రంలోనూ అసాధ్యమని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.
గుర్తించాల్సిన లక్షణాలు ఏమిటి..?
వినికిడి ఒక్కసారిగా పోదు.. అది నెమ్మదిగా మొదలవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. చెవిలో నిరంతరం గంటలు మోగుతున్నట్లు అనిపించడం (tinnitus). నలుగురు ఉన్న చోట ఇతరులు మాట్లాడే మాటలు సరిగ్గా అర్థం కాకపోవడం. టీవీ లేదా మొబైల్ వాల్యూమ్‌ను పదే పదే పెంచాలని అనిపించడం. చెవుల్లో ఏదో బరువుగా ఉన్నట్లు అనిపించడం.. ఈలక్షణాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి..
'60, 60' నియమం ఏమిటీ..?
చెవులను సురక్షితంగా ఉంచుకోవడానికి వైద్యులు ఒక అద్భుతమైన సూత్రాన్ని సూచిస్తున్నారు. అదే '60-60 రూల్'. మీ మొబైల్ లేదా పరికరంలోని గరిష్ట వాల్యూమ్‌లో 60 శాతం కంటే ఎక్కువ శబ్దాన్ని ఎప్పుడూ పెట్టుకోవద్దు.
గంట కంటే ఎక్కువ సమయం నిరంతరంగా ఇయర్‌ఫోన్లు వాడకూడదు. ప్రతి గంటకూ కనీసం 10 నుంచి 15 నిమిషాలు చెవులకు విశ్రాంతి ఇవ్వాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. నాయిస్ క్యాన్సిలేషన్.. బయటి శబ్దాలు వినబడకుండా ఉండటానికి వాల్యూమ్ పెంచే కన్నా, 'నాయిస్ క్యాన్సిలింగ్' హెడ్‌ఫోన్లు వాడటం ఉత్తమం. ఇయర్‌ఫోన్లు పెట్టుకుని నిద్రపోయే అలవాటు మానుకోవాలి. ఇది నరాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు గేమింగ్ లేదా సంగీతం కోసం ఇయర్‌ఫోన్లకు బదులు ఎక్స్టెర్నల్ స్పీకర్లను వాడటం బెటర్.
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com