హై బీపీ నియంత్రణకు చేయాల్సినవి.. చేయకూడనివి..?   

సాక్షి లైఫ్ : హై బ్లడ్ ప్రెషర్‌.. దీనినే హైప‌ర్‌టెన్ష‌న్‌ అనికూడా అంటారు. ఈ  సమస్య వచ్చిందంటే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెద‌డు సంబంధిత ర‌క్త‌నాళాల్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఎక్కువ‌గా ఉంటాయి. అధిక ర‌క్త‌పోటు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి?  ఏం చేస్తే అటువంటి సమస్య నుంచి బయట పడొచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..   

-వంట‌ల త‌యారీలో నూనెలు, కొవ్వు ప‌దార్థాల‌ వినియోగం త‌గ్గించాలి. 

మ‌సాలాలు, కారం వాడ‌కాన్ని అదుపులో పెట్టుకోవాలి. 

-ఉప్ప వినియోగం చాలా త‌గ్గించాలి. 

-పొగ‌తాగ‌డం, మ‌ద్యం తాగడం మానుకోవాలి.

- ప్ర‌తిరోజూ 40నిమిషాలపాటు వ్యాయామం చేయాలి.

- అంతేకాదు నిల్వ ప‌చ్చ‌ళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్‌ ఫుడ్స్‌ పూర్తిగా తగ్గించాలి. 

- వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను పూర్తిగా మానెయ్యాలి. 

-శ‌రీర బ‌రువును త‌గ్గించుకోవాలి. శ‌రీరానికి ఒత్తిడి, తోపాటు అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండాలి. 

 -పలురకాల అలవాట్లను మార్చుకోవ‌డం ద్వారా హైప‌ర్‌టెన్ష‌న్‌ను సమస్యను నియంత్రించవ‌చ్చు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : tensions

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com