Myths vs Facts : జలుబు చేసినప్పుడు అరటిపండు తినకూడదా..?
సాక్షి లైఫ్ : కొన్నిరకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతుంటారు. ముఖ్యంగా చాలా మందికి అరటి పండు విషయంలో సందేహాలు వస్తుంటాయి. జలుబు, దగ్గు రాగానే ఎక్కువమంది అరటిపండును దూరం పెడుతుంటారు. "అరటిపండు తింటే జలుబు ఎక్కువవుతుంది.. కఫం (Phlegm) చేరుతుంది"అని భావిస్తారు. అయితే, ఆధునిక వైద్య శాస్త్రం దీని గురించి ఏం చెబుతోందంటే.. జలుబు చేసినప్పుడు అరటిపండు.. తినకూడదా..? ఎందుకు..? పోషకాల గని అని తెలిసినా భయం ఎందుకు? నిపుణులు ఏమంటున్నారు?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
కఫం పెంచుతుందా..?
ఆయుర్వేదం ప్రకారం అరటిపండు శరీరంలో 'కఫ' దోషాన్ని పెంచుతుంది. జలుబు ఉన్నప్పుడు శరీరంలో ఇప్పటికే శ్లేష్మం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అరటిపండు తినడం వల్ల అది మరింత చిక్కబడే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. అయితే, అందరి విషయంలో ఇది నిజం కాకపోవచ్చు.
సైన్స్ ఏం చెబుతోంది..?
వైద్య రీత్యా చూస్తే, అరటిపండు నేరుగా జలుబుకు కారణం కాదు. పైగా ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి.
విటమిన్ సి, బి6 వంటివి అరటిపండులో ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి శక్తినిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం.. జలుబు వల్ల శరీరం నీరసించినప్పుడు తక్షణ శక్తిని (Instant Energy) అందిస్తుంది. సులభంగా జీర్ణం అవుతుంది. జ్వరం లేదా జలుబుతో ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. అరటిపండు సులభంగా అరుగుతుంది.
ఎప్పుడు దూరంగా ఉండాలి..?
ఇప్పటికే విపరీతమైన దగ్గు, గొంతులో కఫం పేరుకుపోయి ఉన్నట్లు అనిపిస్తే, రాత్రి సమయాల్లో అరటిపండుకు దూరంగా ఉండటమే మంచిది. కొంతమందికి అరటిపండు తిన్న వెంటనే గొంతులో దురద లేదా శ్లేష్మం పెరిగినట్లు అనిపిస్తుంది. అటువంటి వారు జలుబు తగ్గే వరకు దీనిని మానుకోవాలి. చల్లటి లేదా ఫ్రిజ్ లో ఉంచిన అరటిపండ్లు తింటే జలుబు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. జలుబు ఉన్నప్పుడు అరటిపండు తినాలనుకుంటే, మధ్యాహ్నం పూట తీసుకోవడం ఉత్తమం. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తినకపోవడమే మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
