Research Reveals: పరిశోధన : ఈ వ్యాయామంతో పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించవచ్చు..
సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, ఇంటి బాధ్యతల మధ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. వ్యాయామం చేయాలంటే గంటల తరబడి సమయం కేటాయించాలని చాలామంది భావిస్తుంటారు. అయితే, వ్యాయామం కోసం గంటలు గడపాల్సిన అవసరం లేదని, కేవలం 10 నిమిషాల పాటు తీవ్రమైన వ్యాయామం చేస్తే ప్రాణాంతకమైన పేగు క్యాన్సర్‌ను నివారించవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఏమిటీ 10 నిమిషాల ఫార్ములా అంటే..?
యూకేలోని న్యూకాజిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. తక్కువ సమయంలోనే అధిక శక్తిని ఖర్చు చేసే (Vigorous Exercise) వ్యాయామాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. డాక్టర్ సామ్ ఆరెంజ్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన ముఖ్యాంశాలు ఇవే.. మనం తీవ్రంగా వ్యాయామం చేసినప్పుడు రక్తంలో కొన్ని ప్రత్యేక జీవసంబంధ సమ్మేళనాలు విడుదలవుతాయి. ఈ సమ్మేళనాలు శరీరంలోని కణాలకు 'రిపేర్' సంకేతాలను పంపుతాయి. ఫలితంగా దెబ్బతిన్న DNA వేగంగా పునరుద్ధరించబడుతుంది. క్యాన్సర్ కణాలు పెరగడానికి దోహదపడే సంకేతాలను ఈ వ్యాయామం బలహీనపరుస్తుంది.
పరిశోధనలో తేలిన ఆసక్తికర అంశాలు..
శాస్త్రవేత్తలు 50 నుంచి 78 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. వీరు కేవలం 10 నిమిషాల పాటు సైక్లింగ్ చేసిన తర్వాత వారి రక్త నమూనాలను విశ్లేషించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. వ్యాయామం తర్వాత శరీరంలో సుమారు 13 రకాల కీలక ప్రోటీన్ల స్థాయిలు పెరిగాయి. ముఖ్యంగా 'ఇంటర్‌లుకిన్-6' అనే ప్రోటీన్ దెబ్బతిన్న కణాలను సరిచేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.
కణాలు ఆక్సిజన్‌ను సమర్థంగా ఉపయోగించుకునేలా చేయడంతో పాటు, క్యాన్సర్ కణాల దూకుడును ఈ ప్రక్రియ అడ్డుకుంటుంది. సమయం లేదని వ్యాయామానికి దూరం జరిగే వారికి ఈ అధ్యయనం ఒక గొప్ప వరం. రోజుకు కనీసం 10 నిమిషాల పాటు చురుగ్గా నడవటం, సైక్లింగ్ లేదా ఇతర కఠిన శ్రమతో కూడిన పనులు చేయడం వల్ల పేగు క్యాన్సర్ ముప్పును సమర్థంగా ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
