High-Protein Vegetarian Superfoods : ఎక్కువ ప్రోటీన్ లభించే వెజిటేరియన్ సూపర్‌ఫుడ్స్ ఇవిగో..
సాక్షి లైఫ్ : గుడ్లు ప్రోటీన్‌కు గొప్ప మూలం అనే విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ఎక్కువ ప్రోటీన్‌ను అందించే అనేక సూపర్‌ఫుడ్స్ మన వంటగదిలోనే ఉన్నాయనే విషయం మీకు తెలుసా..? ప్రోటీన్ మన శరీరానికి కీలకమైన పోషకం. ప్రోటీన్ సమతుల్య మనం తీసుకునే ఆహారంలో ముఖ్యమైన భాగం. ప్రోటీన్ మన శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ పోషకం కండరాలు, ఎముకలను కూడా బలపరుస్తుంది. ప్రోటీన్ మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్ల సమతుల్యత, చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
మాంసాహారులు ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధార పడుతుంటారు. కానీ శాఖాహారులు తీసుకునే పలు రకాల ఆహారాలలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా శాఖాహారులు గుడ్లు తినరు కాబట్టి, అలాంటి వారు ఖచ్చితంగా తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సోయాబీన్స్..
సోయాబీన్స్ శాఖాహారులకు ఉత్తమ ప్రోటీన్ వనరుగా పరిగణిస్తారు. 100 గ్రాముల ఉడికించిన సోయాబీన్స్‌లో సుమారు 16.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇది గుడ్డు కంటే ఎక్కువ. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు కండరాల పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తాయి.
చీజ్..
100 గ్రాముల చీజ్ సుమారు 11-14 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. చీజ్ శాఖాహారులకు సులభమైన, రుచికరమైన ఎంపిక. ఇది ప్రోటీన్ కు మంచి మూలం మాత్రమే కాదు, ఎముకలను బలపరిచే కాల్షియం ,విటమిన్ B12 కూడా కలిగి ఉంటుంది.
బ్రకోలీ..
బ్రకోలీ అనేది క్రూసిఫెరస్ కూరగాయ. ఇందులో అత్యధికంగా ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల బ్రకోలీలో సుమారు 2.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది గుడ్డు కంటే తక్కువగా అనిపించినప్పటికీ, బ్రకోలీని పెద్ద పరిమాణంలో తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.
చియా సీడ్స్..
ఇవి సాల్వియా హిస్పానికా మొక్క నుంచి వచ్చే సీడ్స్. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, ఒమేగా-3 వంటివి కూడా ఉంటాయి. చియా సీడ్స్ లో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల చియా గింజల్లో 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ సీడ్స్ ను పుడ్డింగ్స్, మిల్క్‌షేక్‌ల లోనూ కలిపి తీసుకోవచ్చు.
క్వినోవా..
ఇది గ్లూటెన్ రహిత ధాన్యం, ఇది అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. 100 గ్రాముల వండిన క్వినోవాలో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం అవ్వడమేకాకుండా, వేగంగా బరువు తగ్గడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
గ్రీక్ యోగర్ట్..
ఇది సాధారణ పెరుగు కంటే కాస్త మందంగా ఉంటుంది. ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్ లో దాదాపు 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, కండరాల నిర్మాణానికి కూడా సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
