సాక్షి లైఫ్ : జుట్టు రాలడం, అలసట, చేతులు, కాళ్ళలో మంటలు విటమిన్ లోపాలు ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. 70 శాతం నుంచి 90శాతం మంది భారతీయులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. 47శాతం మంది విటమిన్ బి 12 లోపం కలిగి ఉన్నారు. విటమిన్లు, ఖనిజాలు వివిధ సాధారణ శరీర విధులకు అవసరమైన సూక్ష్మపోషకాలు. విటమిన్ "డి" మినహా అన్ని సూక్ష్మపోషకాలకు మనం ఆహారం మీద ఆధారపడాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..Eye Health : డిజిటల్ యుగంలో కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..
ఇది కూడా చదవండి..Respiratory Diseases : శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులకు వైద్యనిపుణుల సూచనలు..!
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
కీలక పాత్ర..
శరీరానికి అవి చాలా తక్కువ మొత్తంలో అవసరమైనప్పటికీ, అవి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు శక్తిని నిర్వహించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, సజావుగా రక్త ప్రసరణను నిర్వహించడానికి సహాయపడతాయి, అయితే ఖనిజాలు పెరుగుదల, ఎముకల బలం ,ద్రవ సమతుల్యతకు అవసరం. ప్రపంచవ్యాప్తంగా విటమిన్, ఖనిజ లోపాల వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వివిధ స్థాయిలలో ప్రయత్నాలు చేస్తోంది.
శరీరానికి పిండి పదార్థాలు, మాంసకృత్తులు ఎంత అవసరమో.. అంతే స్థాయిలో విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా అవసరం. వీటిని 'సూక్ష్మ పోషకాలు' (Micronutrients) అంటారు. ఇవి చాలా తక్కువ పరిమాణంలో అవసరమైనప్పటికీ, వీటి లోపం తలెత్తితే మాత్రం సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది. జుట్టు రాలడం నుండి ఎముకల బలహీనత వరకు అనేక సమస్యలు ఈ పోషకాల కొరత వల్లే వస్తాయి.
హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయి మరి..?
శరీరంలో విటమిన్లు, ఖనిజాలు తగ్గినప్పుడు శరీరం కొన్ని సంకేతాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. అవేంటంటే..?
తరచూ నీరసం, అలసట ఆవహించడం.కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు లేదా మంటలు రావడం.విపరీతంగా జుట్టు రాలడం.గాయాలు త్వరగా మానకపోవడం.కండరాలు, ఎముకల్లో తరచూ నొప్పులు రావడం.
ఏ పోషకం.. ఎందులో లభిస్తుంది..?
రోజువారీ ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా పోషకాల లోపాలను అధిగమించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. విటమిన్ బి-కాంప్లెక్స్.. పాలు, గుడ్లు, మాంసం, చేపలు, తృణధాన్యాలు, పుట్టగొడుగులు,అవకాడోలలో పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి.. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు, బెల్ పెప్పర్స్, మొలకల్లో లభిస్తుంది. విటమిన్ ఏ.. కంటి చూపు కోసం క్యారెట్లు, చిలగడదుంపలు, పాలకూర తీసుకోవాలి. విటమిన్ డి.. ఉదయం ఎండలో ఉండటం, చేప నూనె, పాలు దీనికి ప్రధాన వనరులు.
ఖనిజాలు.. కాల్షియం: పాలు, పెరుగు, ఆకుకూరలు, బ్రోకలీ.
మెగ్నీషియం.. బాదం, జీడిపప్పు, నల్ల బీన్స్.
పొటాషియం..అరటిపండ్లు, కాయధాన్యాలు.
శోషణ పెరగాలంటే.. వ్యాయామం తప్పనిసరిగాచేయాలి..!
కేవలం మల్టీవిటమిన్ మాత్రలు వేసుకుంటే సరిపోదు. శరీరానికి తగినంత శారీరక శ్రమ, వ్యాయామం వంటివి లేకపోతే, మనం తీసుకునే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించదు.
ఇది కూడా చదవండి..Afternoon Nap: మధ్యాహ్నం నిద్ర.. వరమా..? శాపమా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com