Salt : ఉప్పు ఎక్కువ తింటున్నారా..? బీపీ మాత్రమే కాదు.. ఈ అవయవాలకూ ముప్పే..!
సాక్షి లైఫ్ : కూరల్లో ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అలాగని కాస్త ఉప్పు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తప్పదు. ఉప్పు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది 'హై బీపీ'. కానీ, మోతాదుకు మించి ఉప్పు (salt) తీసుకుంటే కేవలం రక్తపోటు మాత్రమే కాదు, గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్..
ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫుడ్..?
రోజుకు ఎంత ఉప్పు తినాలి..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం, ఒక వయోజన వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును మాత్రమే తీసుకోవాలి.
కేవలం వంటల్లో వాడే ఉప్పు మాత్రమే కాకుండా.. ప్యాకేజ్డ్ ఫుడ్స్, నంజుకునే స్నాక్స్, పచ్చళ్లు, సాస్ల ద్వారా కూడా మన శరీరంలోకి అధికంగా సోడియం చేరుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
శరీర అవయవాలపై అధిక ఉప్పు ప్రభావం
రక్తనాళాలపై ఒత్తిడి..శరీరంలో సోడియం స్థాయిలు పెరిగినప్పుడు, ద్రవాలు పేరుకుపోతాయి. ఇది రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడిని పెంచి, హై బీపీ (bp)కి దారితీస్తుంది.
గుండెపై భారం..
రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఈ ఒత్తిడి కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
శరీరంలో నీరు, సోడియం సమతుల్యతను కాపాడటంలో కిడ్నీల పాత్ర కీలకం. ఉప్పు మోతాదు పెరిగినప్పుడు, అదనపు సోడియంను బయటకు పంపడానికి కిడ్నీలు అదనంగా శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా కాలక్రమేణా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది.
శరీరంలో నీరు చేరడం (Water Retention)..
ఎక్కువ సోడియం వల్ల శరీరంలో నీరు నిలిచిపోయి, కాళ్లు చేతుల్లో వాపులు వస్తాయి. ముందుగానే గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు సూచనలు..
వంట వండేటప్పుడే ఉప్పు మోతాదును తగ్గించండి.
భోజనం చేసేటప్పుడు అన్నంలో లేదా సలాడ్లపై అదనంగా పచ్చి ఉప్పును చల్లుకునే అలవాటును తక్షణమే మానుకోండి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఉప్పగా ఉండే స్నాక్స్, బేకరీ పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి..ప్రపంచంలోనే తొలిసారిగా గొర్రెలో బర్డ్ ఫ్లూ..
ఇది కూడా చదవండి..పేస్మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
