Health tests : జిమ్ కు వెళుతున్నారా..? అయితే ఈ టెస్టులు మస్ట్..!
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో చెమటోడ్చడం మంచిదే. ఆరోగ్య నిపుణుల ప్రకారం ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఇటీవల కాలంలో జిమ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వారి వార్తలు మనం తరచుగా వింటున్నాం. అందుకే, భారీ వ్యాయామాలు మొదలుపెట్టే ముందు మీ శరీరం అందుకు ఏ మేర సిద్ధంగా ఉందో తెలుసుకోవడం అత్యంత అవసరం.
ముందస్తు హెచ్చరికలు నిర్లక్ష్యం చేయొద్దు..!
జిమ్ ప్రారంభించిన కొత్తలో కొందరికి విపరీతమైన అలసట రావడం, కళ్లు తిరగడం, కండరాలు పట్టేయడం లేదా గుండె అసాధారణంగా కొట్టుకోవడం లాంటివి జరుగుతాయి. చాలామంది ఇది సాధారణమే అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఇవి శరీరం పంపుతున్న హెచ్చరికలు కావచ్చు. ముఖ్యంగా వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు లేదా చాలా కాలం గ్యాప్ తర్వాత వ్యాయామం మొదలుపెడుతున్న వారు ముందుగా డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
జిమ్‌కు వెళ్లే ముందు చేయించుకోవాల్సిన ముఖ్యమైన రక్త పరీక్షలు..
వ్యాయామం సురక్షితంగా సాగాలంటే ముందుజాగ్రత్తగా ఈ కింది రక్త పరీక్షలు (Blood Tests) చేయించుకోవడం ఉత్తమం:
కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC)..
శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ పనితీరును ఇది తెలుపుతుంది. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే త్వరగా అలిసిపోవడం, ఆయాసం రావడం జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో హెవీ వర్కౌట్స్ చేయడం ప్రమాదకరం.
లిపిడ్ ప్రొఫైల్ (Lipid Profile).. రక్తంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉన్నవారు, ధూమపానం చేసేవారు,కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు ఈ పరీక్షను కచ్చితంగా చేయించుకోవాలి.
ఎలక్ట్రోలైట్స్ టెస్ట్..
కండరాలు, నరాల పనితీరుకు ఈ ఖనిజాలు ఎంతో కీలకం. శరీరంలో వీటి సమతుల్యత దెబ్బతింటే కండరాలు పట్టేయడం, విపరీతమైన నీరసం, అధికంగా చెమట రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. విటమిన్, ఐరన్ టెస్టులు..ఐరన్, విటమిన్ బి12, విటమిన్ డి స్థాయిలను కూడా పరీక్షించుకోవాలి. ఈ పోషకాల లోపం ఉంటే వ్యాయామం తర్వాత కండరాలు త్వరగా కోలుకోలేవు. అంతే కాకుండా ఎముకల నొప్పులు, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
