Swine Flu : సాధారణ జలుబే అనుకుంటున్నారా..? ఆ లక్షణాలు స్వైన్ ఫ్లూకి సంకేతం కావొచ్చు..!
సాక్షి లైఫ్ : మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఫ్లూ లాంటి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా స్వైన్ ఫ్లూ H1N1 ఇన్ఫ్లూయెంజా.. కేసులు ఈమధ్య వేగంగా నమోదవుతున్నాయి. మొదట్లో ఇది సాధారణ జలుబు లేదా వైరల్ జ్వరంగానే అనిపించినా.. కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. అసలు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఏంటి? దీన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం..
స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది ఇన్ఫ్లుయెంజా 'ఎ' (H1N1) వైరస్ వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధి. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. అలాగే, వైరస్ ఉన్న వస్తువులను తాకి, అవే చేతులతో కళ్లు, ముక్కు లేదా నోటిని ముట్టుకోవడం వల్ల కూడా ఇది సోకుతుంswiది.
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
ప్రధాన లక్షణాలు ఇవే..
తీవ్రమైన జ్వరం, చలి.. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం, విపరీతమైన చలిగా అనిపించడం, నీరసంగా ఉండటం దీని ప్రాథమిక లక్షణాలు.
ఎడతెగని దగ్గు, గొంతునొప్పి.. పొడి దగ్గు లేదా ఎడతెగని దగ్గు, గొంతునొప్పి, గొంతులో గరగర ఉంటాయి. కొందరిలో ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ వేయడం జరుగుతుంది.
కండరాలు, ఒళ్లు నొప్పులు.. తీవ్రమైన తలనొప్పితో పాటు కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. రోజువారీ పనులు చేసుకోలేనంతగా విపరీతమైన అలసట ఆవరిస్తుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, ఛాతీ నొప్పి లాంటివి కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి వ్యాధి తీవ్రతకు సంకేతాలు.
వాంతులు, విరేచనాలు..అందరిలో ఒకేలా లక్షణాలు ఉండవు. కొందరు రోగుల్లో ముఖ్యంగా పిల్లల్లో జ్వరంతో పాటు వాంతులు లేదా విరేచనాలు కూడా కనిపిస్తాయి.
నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు..
చేతులను తరచుగా సబ్బు, నీళ్లతో లేదా శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోవాలి. బయటి నుంచి రాగానే ఈ పని తప్పనిసరిగా చేయాలి.
దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు చేతి రుమాలు లేదా మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. వాడిన టిష్యూలను వెంటనే చెత్తబుట్టలో పడేయాలి.
భౌతిక దూరం: ఫ్లూ లక్షణాలు ఉన్నవారికి కాస్త దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని పదేపదే తాకే అలవాటును మానుకోవాలి. వ్యాధులు ప్రబలుతున్న సమయంలో రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
డాక్టర్లను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
జ్వరం తీవ్రంగా ఉన్నా, రోజుల తరబడి తగ్గకపోయినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, విపరీతమైన నీరసం, గందరగోళంగా అనిపించడం లాంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే డాక్టర్లను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..
ఇది కూడా చదవండి..ప్రపంచంలోనే తొలిసారిగా గొర్రెలో బర్డ్ ఫ్లూ..
ఇది కూడా చదవండి..పేస్మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
