Toxic Air Pollution : విషపూరితమైన కాలుష్యం నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ముఖ్య సూచనలు..!
సాక్షి లైఫ్ : దేశంలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఈ కలుషిత వాతావరణం పెద్దల కంటే చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, వారి శ్వాస వేగం పెద్దల కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గాలిలోని PM 2.5, PM 10 వంటి సూక్ష్మ కణాలు పిల్లల శ్వాసకోశ వ్యవస్థలోకి చేరి దగ్గు, ఆయాసం, అలర్జీలు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీసే ముప్పుంది. ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతో అవసరమని శిశు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
చిన్నారుల రక్షణ కోసం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఏక్యూఐ (AQI).. పిల్లలను ఆరుబయటకు పంపే ముందు మీ ప్రాంతంలోని గాలి నాణ్యత సూచీని (AQI) తనిఖీ చేయండి. వాతావరణం విషపూరితంగా ఉన్న వేళల్లో వారిని బయటకు పంపకపోవడమే మంచిది. గాలి నాణ్యత పడిపోయిన రోజుల్లో పార్కులు, మైదానాల్లో ఆటలను నివారించాలి. ముఖ్యంగా పరుగు, సైక్లింగ్ వంటి వేగంగా శ్వాస తీసుకునే వ్యాయామాలను ఆరుబయట కాకుండా ఇంటి లోపలే చేయించాలి.
ఇంటి లోపలి గాలి నాణ్యత..
కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచడం శ్రేయస్కరం. గాలి స్వచ్ఛత కోసం అవసరమైతే నాణ్యమైన హెపా (HEPA) ఫిల్టర్ ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించవచ్చు. కాలుష్య వాతావరణంలో తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ముఖానికి సరిగ్గా సరిపోయే నాణ్యమైన మాస్కులను ధరింపజేయాలి. అయితే రెండేళ్ల లోపు చిన్నారులకు ఎలాంటి మాస్కులు వాడకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
సమతుల్య ఆహారం - హైడ్రేషన్..
శరీరంలో విష వ్యర్థాలు చేరకుండా ఉండటానికి పిల్లలు రోజంతా తగినంత నీరు తాగేలా చూడాలి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను రోజూ తినిపించాలి. ఇంట్లో పొగ, దుమ్ము లేకుండా చూడటం.. గదుల లోపల అగరబత్తులు, సాంబ్రాణి పొగ లేదా దోమల నివారణ కాయిల్స్ వాడకాన్ని తగ్గించాలి. గదిని శుభ్రం చేసేటప్పుడు దుమ్ము లేవకుండా తడి గుడ్డతో తుడవడం ఉత్తమం.
ఇండోర్ యాక్టివిటీస్పై దృష్టి.. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండేందుకు ఇంట్లోనే ఆడే ఆటలు, పెయింటింగ్, పుస్తక పఠనం లేదా యోగా వంటి సృజనాత్మక పనుల్లో నిమగ్నం చేయాలి. పిల్లల్లో ఎడతెగని దగ్గు, పిల్లికూతలు, ఆయాసం లేదా కళ్లు మండటం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
