హెచ్‌ఐవీలో ఎన్ని దశలు ఉంటాయి..?

సాక్షి లైఫ్ : హెచ్‌ఐవి ఉన్న ప్రతి వ్యక్తిలో ఆయా లక్షణాలు కనిపించకపోవచ్చని, కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే హెచ్‌ఐవీ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే  అనారోగ్యంగా అనిపించకపోయినా హెచ్‌ఐవి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. హెచ్ ఐవీకి సంబంధించిన కొన్నిలక్షణాలు ఫ్లూ లక్షణాలవలె ఉంటాయి. అంతేకాకుండా మరికొన్ని లక్షణాలు కొందరిలో కనిపించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.     

హెచ్ ఐవీ.. లక్షణాలు..  

దద్దుర్లు
జ్వరం
అలసట
నోటి పూత
గొంతు మంట
కండరాల నొప్పి
రాత్రి సమయంలో ఎక్కువగా చెమటలు
 
హెచ్ ఐవీ దశలు.. 

హెచ్‌ఐవి సోకిందంటే ఆ వ్యక్తికి ఎయిడ్స్ వస్తుందని కాదు. ఈ వైరస్ బారిన పడిన తర్వాత, AIDS దాని మూడు దశలను దాటిన తర్వాత సంభవిస్తుంది. హెచ్ ఐవీలో మూడు దశలు ఉంటాయి.. అవి..  

మొదటి దశ : అక్యూట్ HIV.. 

కొంతమందికి హెచ్‌ఐవి సోకిన నెల లేదా రెండు నెలల తర్వాత ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు తరచుగా ఒక వారం నుంచి  ఒక నెల రోజులవరకు ఉంటాయి. 

రెండవ దశ : క్రానిక్ స్టేజ్.. 

మొదటి దశలో వైరస్ గుర్తించకపోతే, వ్యక్తి రెండవ దశలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఐతే ఒక్కోసారి కొందరు అనారోగ్యంగా  లేకపోయినా కొన్ని సంవత్సరాలపాటు హెచ్ఐవి కలిగి ఉండవచ్చు. పైకి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, వీరి ద్వారా ఇతరులకు HIV వ్యాప్తి చెందడానికి అవకాశాలున్నాయి. 

మూడవ దశ : ఎయిడ్స్

AIDS అనేది HIV సంక్రమణ అత్యంత తీవ్రమైన చివరి దశ. ఈ దశలో, HIV రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా బలహీనపరిచి, ఆరోగ్యాన్ని మరింతగా క్షీణింప చేస్తుంది. 

ఎయిడ్స్ లక్షణాలు..?

HIV సంక్రమణ వల్ల AIDS వస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.

HIV/AIDS ఎలా వస్తుంది..?

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ వల్ల HIV వస్తుంది. ఈ వైరస్   రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీని కారణంగా అది బలహీనపడుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల శరీరం ఇతర వ్యాధులతో పోరాడలేకపోతుంది. దీని కారణంగా ఎయిడ్స్ వస్తుంది.

HIV ఎలా వ్యాపిస్తుంది..?
 
ఈ వైరస్ ఏదైనా సోకిన వ్యక్తి రక్తం, వీర్యం, జననాంగ స్రావాల వంటి శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ నోరు, పాయువు, పురుషాంగం, యోని లేదా పగిలిన చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

శరీరంలో ఎక్కడైనా గాయం ఉంటే.. ఆ గాయం ద్వారా కూడా HIV చర్మంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అసురక్షిత శృంగారం, మాదకద్రవ్యాల వినియోగం, ఒకరికి సూదిమందు ఇచ్చిన సూదిని ఇంకొకరికి వాడడంవల్ల HIV వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ముద్దు పెట్టుకోవడం వల్ల హెచ్‌ఐవీ వస్తుందా..?

లాలాజలం ద్వారా HIV వ్యాపించదు కాబట్టి, ఈ వైరస్ సోకిన వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం వల్ల రాదు. అయితే, వ్యాధి సోకిన వ్యక్తికి నోటి పుండ్లు లేదా చిగుళ్లలో రక్తస్రావం ఉంటే, తద్వారా HIV సంక్రమించే అవకాశం ఉంది. 

HIV/AIDS ఉన్న వ్యక్తిని తాకడం లేదా కౌగిలించుకున్నా..
పబ్లిక్ బాత్రూమ్ లేదా స్విమ్మింగ్ పూల్ వాడినా..హెచ్‌ఐవీ రాదు.    

HIV/AIDS ఉన్న వ్యక్తులతో కప్పులు, పాత్రలు లేదా టెలిఫోన్‌లను పంచుకున్నా వ్యాధి సోకదు. ఎయిడ్స్  రక్తదానం చేయ

HIVకి ఏదైనా నివారణ ఉందా..?

ప్రస్తుతం హెచ్‌ఐవికి చికిత్స లేదు, దీని చికిత్సలో ఉపయోగించే మందులు చాలా వరకు హెచ్‌ఐవిని నిరోధిస్తాయి.

క్రమం తప్పకుండా మందులు తీసుకొవడం ద్వారా HIVకి చికిత్స పొందవచ్చు. దీనినే యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) అంటారు. 

సమగ్ర నివారణలో భాగంగా, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్న వ్యక్తులకు అదనపు నివారణ ఎంపికగా యాంటీరెట్రోవైరల్ థెరపీ  తోపాటు ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అందించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  సిఫార్సు చేసింది. 

హెచ్‌ఐవి సోకకుండా ఉండాలంటే..?  

హెచ్‌ఐవి ప్రమాదాన్ని తగ్గించడానికి.. అసురక్షిత శృంగారాన్ని నివారించండి. పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు, టాటూ పార్లర్లకు వెళ్ళినప్పుడు ఒకరికి వాడిన నీడిల్స్ ను మరొకరికి వాడకుండా జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఐవీ ఉన్నవారి రక్తాన్ని మరొకరికి ఎక్కించకూడదు.   
పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు, కొత్తసూది, టాటూ పరికరం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : hiv-symptoms

Related Articles

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com