Drooling During Sleep: నిద్రలో చొంగ కారుతే..? తీవ్ర అనారోగ్యసమస్యకు సంకేతమా..?
సాక్షి లైఫ్ : నిద్రపోయి లేచిన తర్వాత దిండు తడిచిపోయి ఉండటం చాలామందికి అనుభవమే. అప్పుడప్పుడు ఇలా జరిగితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇది ప్రతిరోజూ జరిగితే మాత్రం అప్రమత్తం కావాల్సిందేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలో చొంగ కారడం (Drooling) అనేది కేవలం అసౌకర్యమే కాదు, శరీరంలోని కొన్ని తీవ్రమైన అంతర్గత సమస్యలకు సంకేతం కావచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ప్రధాన కారణాలు ఏమిటి..?
నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడాన్ని స్లీప్ అప్నియా అంటారు. ఇలాంటి వారు గాలి కోసం నోటి ద్వారా శ్వాస తీసు కుంటారు. ఆ సమయంలో నోటిలో లాలాజలం అధికంగా చేరి బయటకు వస్తుంది. దీనివల్ల గుండెపోటు, మధుమేహం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి.
జీర్ణాశయంలోని ఆమ్లాలు వెనక్కి తన్నడం (Gerd) వల్ల కూడా లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఆమ్ల ప్రభావాన్ని తగ్గించడానికి శరీరం సహజంగానే ఎక్కువ లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది నిద్రలో చొంగగా మారుతుంది. జలుబు, సైనస్ లేదా అలర్జీల వల్ల ముక్కు రంధ్రాలు మూసుకుపోయినప్పుడు నోటితో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా లాలాజలం నియంత్రణ తప్పుతుంది.
అరుదుగా పక్షవాతం (Stroke) లేదా పార్కిన్సన్స్ వంటి వ్యాధుల వల్ల గొంతు కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల లాలాజలాన్ని మింగడం కష్టమై చొంగ కారుతుంది. పళ్లు నూరడం లేదా దంతాల అమరిక సరిగ్గా లేకపోవడం వల్ల కూడా నోరు పూర్తిగా మూతపడదు. ఇది నిద్రలో ద్రవాలు బయటకు రావడానికి కారణమవుతుంది.
పరిష్కారం ఏమిటి..?
మీకు ప్రతిరోజూ దిండు తడిచిపోయేంతగా చొంగ కారుతుంటే, వెంటనే ఈఎన్‌టీ (ENT) నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ముఖ్యంగా గురక రావడం, నిద్రలో శ్వాస అందక మెలకువ రావడం వంటి లక్షణాలు ఉంటే 'స్లీప్ స్టడీ' చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో చూసి నోటికి టేపులు వేసుకోవడం (Mouth Taping) వంటివి ప్రాణాంతకం కావచ్చు. ముక్కులో అడ్డంకులు ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల ఊపిరి ఆడక ఇబ్బందులు తలెత్తుతాయి.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
