Stop Deadly Viruses : గబ్బిలాలకు దోమలతో టీకా.. ప్రాణాంతక వైరస్‌లకు చెక్ పెట్టే సరికొత్త ప్రయోగం..!
సాక్షి లైఫ్ : గబ్బిలాల ద్వారా మనుషులకు సోకే రేబీస్, నిపా వంటి ప్రాణాంతక వైరస్‌లను అడ్డుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. టీకాను నేరుగా గబ్బిలాలకు అందించడం కష్టంతో కూడుకున్న పని కావడంతో, 'దోమల'ను వాహకాలుగా వాడుకుని వాటికి వ్యాక్సిన్ వేయవచ్చని చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. 'సైన్స్ అడ్వాన్సెస్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ప్రయోగంలో..
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు 'ఈడిస్ ఈజిప్టి' రకం దోమలకు రేబీస్ లేదా నిపా వైరస్ నిరోధక టీకా కలిపిన రక్తాన్ని ఆహారంగా ఇచ్చారు. ఈ టీకా వైరస్ దోమల శరీరంలో వృద్ధి చెంది వాటి లాలాజల గ్రంధులకు చేరుకుంది. ఆ తర్వాత ఈ దోమలు గబ్బిలాలను కుట్టినప్పుడు లేదా గబ్బిలాలు ఆ దోమలను తిన్నప్పుడు, వాటి శరీరంలోకి టీకా ప్రవేశించి యాంటీబాడీలు తయారవుతున్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో గుర్తించారు.
ఈ పద్ధతిలో టీకా పొందిన ఎలుకలు, గబ్బిలాలు తర్వాతి కాలంలో రేబీస్ వైరస్ బారిన పడినా సురక్షితంగా జీవించగలిగాయి. మనుషులలో 75 శాతం మరణాల రేటు ఉన్న నిపా వైరస్‌ను అడ్డుకోవడంలోనూ ఈ ప్రయోగం సానుకూల ఫలితాలనిచ్చింది. పండ్లను తినే గబ్బిలాలు (Fruit bats) దోమలను తినవు కాబట్టి, వాటి కోసం టీకా కలిపిన ద్రావణాన్ని ప్రత్యేక కేంద్రాల ద్వారా అందించ వచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
సవాళ్లు..సందేహాలు..?
ఈ ప్రయోగం ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అనేక సాంకేతిక, నైతిక పరమైన అడ్డంకులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడవుల్లో ఉండే వేల సంఖ్యలోని గబ్బిలాలకు దోమల ద్వారా సమానంగా టీకా అందుతుందా? అన్నది ఒక ప్రశ్న. అలాగే, వ్యాక్సిన్ మోసుకెళ్లే దోమలు ఇతర జంతువులను లేదా మనుషులను కుట్టినప్పుడు కలిగే పరిణామాలపై మరింత లోతైన అధ్యయనం అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మనుషులకు సోకే జంతువుల నుంచి వచ్చే వ్యాధులను(zoonotic diseases) అవి పుట్టే చోటే తుడిచిపెట్టడానికి ఈ 'దోమల టీకా' పద్ధతి భవిష్యత్తులో ఒక కీలక ఆయుధంగా మారే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
