150 Minutes of Exercise a Week: దీర్ఘాయువుకు వారానికి 150 నిమిషాల వ్యాయామం దివ్యౌషధం..!

షేర్ చేయండి:
150 Minutes of Exercise a Week: దీర్ఘాయువుకు వారానికి 150 నిమిషాల వ్యాయామం దివ్యౌషధం..!

సాక్షి లైఫ్ : మనం ఎంత కాలం జీవిస్తాం అనేది మనం చేసే శారీరక శ్రమపైనే ఆధారపడి ఉంటుందని తాజా అధ్యయనాలు వెల్లడి స్తున్నాయి. నిత్యం వ్యాయామం చేయడం వల్ల అకాల మరణాల ముప్పు తగ్గడమే కాకుండా, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) జరిపిన భారీ విశ్లేషణలో తేలింది. ముఖ్యంగా వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఓ మోస్తరు శ్రమతో కూడిన వ్యాయామం చేస్తే గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

 

అధ్యయనంలో.. 

వారానికి 300 నుంచి 600 నిమిషాల పాటు వేగంగా నడక (Brisk Walking) లేదా సైక్లింగ్ వంటి పనులు చేసే వారిలో మరణాల ముప్పు 26 నుంచి 31 శాతం వరకు తగ్గుతున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఎలాంటి వ్యాయామం చేయని వారు కూడా, వారానికి కేవలం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం ప్రారంభించినా.. మరణాల ముప్పు 20 శాతానికి పైగా తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

సాధారణ నడకతో పాటు అప్పుడప్పుడు వేగంగా పరుగెత్తడం (Vigorous activity) వంటివి కలిపి చేయడం వల్ల గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడి గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

 శ్రమ అవసరమే..!

వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల నుంచి 70 ఏళ్ల పైబడిన వారి వరకు ప్రతి ఒక్కరికీ శారీరక శ్రమ ఎంతో అవసరం. నిత్యం చురుగ్గా ఉండటం వల్ల మెటబాలిజం మెరుగుపడటమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. వ్యాయామాన్ని ఒకేసారి కాకుండా రోజంతా చిన్న చిన్న సెషన్లుగా విభజించుకోవాలి. నడక, ఈత, సైక్లింగ్ వంటి రకరకాల వ్యాయామాల ను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. వారానికి లక్ష్యంగా పెట్టుకున్న 150 నుంచి 300 నిమిషాల సమయాన్ని తప్పకుండా పాటించాలి.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.