సాక్షి లైఫ్ : ఒక్కో క్యాన్సర్ కు కొన్నిరకాల లక్షణాలు ఉంటాయి. అటువంటివాటిని ముందుగా గుర్తిస్తే సులువుగా ఆయా క్యాన్సర్ బారీ నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్లను మొదటి లేదా రెండో దశలో గుర్తిస్తే 80 శాతం మంది రోగులకు చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చని ఇటీవల జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా 40 శాతం క్యాన్సర్లను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
నోటి పుండ్లు..
నాలుక లేదా నోటిలోని ఇతర భాగాలలో తిమ్మిరి
గొంతులో ఏదో ఇరుక్కుపోయిన అనుభూతి
దీర్ఘకాలంగా గొంతు నొప్పి
ఆరు వారాల కంటే ఎక్కువగా గొంతు నొప్పి
దంతాలు బలహీనంగా అనిపిస్తాయి
చిగుళ్ళలో రక్తస్రావం..
నోటిలో పుండ్లు మూడు వారాలు దాటినా మనకపోవడం..
నోరు, దవడ లేదా మెడ వద్ద గడ్డ లేదా వాపు మూడు వారాల కంటే ఎక్కువ ఉంటుంది.
మింగడం లేదా నమలడం కష్టంగా అనిపించడం
ఈ లక్షణాలు గమనించినట్లయితే, మీరు ఖచ్చితంగా వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.