స్పైసీ ఫుడ్స్ తినడం ద్వారా బరువు తగ్గొచ్చా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల కేవలం బరువు తగ్గడం సాధ్యం కాదు. కానీ కొన్ని కారణాల వల్ల స్పైసీ ఫుడ్స్ కొన్ని ప్రామాణిక ప్రయోజనాలు కలిగి ఉండవచ్చు.. మిరపకాయలు, కారం వంటి పదార్థాలు మెటబాలిజాన్ని పెంచే గుణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో కాలరీలను వేగంగా బర్న్ అవ్వడానికి సహాయపడుతాయి. 
 
ఆహారం రుచిని పెంచడంలో కారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కూరల రుచిని పెంచడమేకాదు కానీ శరీరంలో మెటబాలిజాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా..? అవును ఇది నిజం. మసాలా ఆహారాలు మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. స్పైసీ ఫుడ్స్ కేలరీలను బర్న్ చేయడానికి , బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి. 

 ఇది కూడా చదవండి.. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల బరువు తగ్గుతారా..? 

 ఇది కూడా చదవండి.. ఉదయాన్నే ప్రోటీన్-రిచ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే ఈ ఏడు బెనిఫిట్స్ పొందవచ్చు.. 

 ఇది కూడా చదవండి.. మీరు చికెన్ లివర్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాలి..

 

స్పైసీ ఫుడ్స్‌లోని క్యాప్సైసిన్ నోటిలో హీట్ సెన్సింగ్ బడ్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. శరీరం వేగంగా చెమటలు పట్టడం, మండే అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. స్పైసీ ఫుడ్  ఆకలిని తగ్గిస్తుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. 

క్యాప్సైసిన్ కేలరీలను బర్న్ చేయడమే కాకుండా కొవ్వును కూడా విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ప్రక్రియను లిపోలిసిస్ అంటారు. క్యాప్సైసిన్ థర్మోజెనిసిస్‌ను పెంచుతుంది. దీని వల్ల శరీరం త్వరగా వేడెక్కుతుంది. జీవక్రియను పెంచుతుంది. ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.

 

 ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.