కల్తీ పనీర్ ను ఎలా గుర్తించవచ్చు..?  

సాక్షి లైఫ్ : అనలాగ్ పనీర్‌లో అధిక ట్రాన్స్ ఫ్యాట్ కలిగిన హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్‌లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాదు అనేక అనారోగ్య సమస్యలకు కారణమ వుతుంది. పాలతో చేసిన పనీర్‌తో పోలిస్తే, అనలాగ్ పనీర్‌లో ప్రోటీన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 

 

ఇది కూడా చదవండి..పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా?

ఇది కూడా చదవండి..మినరల్ వాటర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన.. 

ఇది కూడా చదవండి..ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? 

 

పనీర్ కొనేముందు వారు కొనుగోలు చేస్తున్న పనీర్ ఉత్పత్తుల బ్రాండింగ్, పోషక విలువలను జాగ్రత్తగా తనిఖీ చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. తయారీ కంపెనీలు ఉత్పత్తుల కవర్‌పై చిన్న అక్షరాలలో 'అనలాగ్' అని రాస్తూ ఉంటాయి. ఈ సంగతి తెలియక, వినియోగదారులు దానిని పాల ఆధారిత పనీర్ గా భావించి కొనుగోలు చేస్తున్నారు.

చాలా మందికి ఇప్పటికీ అనలాగ్ పనీర్ గురించి తెలియదు. కాబట్టి, వారు పనీర్ వంటకాలను ఆర్డర్ చేసినప్పుడు, అది ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా లేదా రెస్టారెంట్‌లో అయినా సరే అది నిజమైన పాలతో తయారైన పనీరా..? లేదా కూరగాయలు లేదా జంతువుల కొవ్వులతో తయారు చేసిందా..? అని తనిఖీ చేయరు. పనీర్ అనలాగ్ లేదా పాలతో తయారుచేసిందా..? అని స్పష్టంగా ప్రకటిస్తే ఆయా కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చర్యలు తీసుకోవడానికి వీలుకలుగుతుంది.

 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : harmful-to-health heart-risk heart-health heart-problems unhealthy-foods fssai paneer adulterated-food real-paneer food-safety-and-standards-authority-of-india vegetable-oils animal-fat anallog-paneer trans-fat hydrogenated-vegetable-oils
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com