పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన భారతీయ వంటగదిలో పసుపు ఒక ముఖ్యమైన భాగం.   శుభకార్యాల దగ్గర్నుంచి వంటల వరకు పసుపును వాడుతూ ఉంటారు. పసుపు మహిళల అందాన్ని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.  పసుపు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీనివల్ల వ్యాధులతో పోరాడే శక్తి వస్తుంది. అంతేకాదు శరీరంలో వాపులను తగ్గించేందుకు కూడా ఇది పనిచేస్తుంది. పసుపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు సాధారణంగా వినే ఉంటారు. అయితే పసుపుఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా? ఆయా దుష్ప్రభవాలను గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అవేంటో వివరంగా తెలుసుకుందాం..

పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపును రోజూ తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, దానిని అధికంగా ఉపయోగించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..మినరల్ వాటర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన.. 

ఇది కూడా చదవండి..ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

పసుపు దుష్ప్రభావాలు..? 

పసుపు ఎక్కువగా తినడం వల్ల పొట్ట ఉబ్బిపోతుంది. దీని వల్ల మీకు డయేరియా, గ్యాస్, అపానవాయువు వంటి అనేక సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి పసుపును ఎక్కువ మోతాదులో తీసుకుంటే, దానిని నియంత్రించండి.

పసుపు రక్తాన్ని పల్చగా చేస్తుంది. ఇప్పటికే రక్తాన్ని పలుచన చేసే మందులను వాడేవాళ్లు, పసుపును ఎక్కువగా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు.

పసుపు వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అదే సమయంలో, కొంతమందికి పసుపుకు అలెర్జీ ఉండవచ్చు, దీని కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద, వాపు సమస్యలు వస్తాయి.

పసుపును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్  వస్తాయి. తలనొప్పిగా కూడా వస్తుంది. 

 కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది.

గర్భిణీ స్త్రీలు కూడా పసుపును ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే ఇది గర్భాశయ కండరాలను ఉత్తేజపరుస్తుంది. రక్తం పలచగా ఉండేందు కోసం మందులు వేసుకునేవాళ్లు పసుపు చాలా తక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పసుపు కూడా రక్తాన్ని పలచబరుస్తుంది. దీంతో రోగులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి..కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ కు కారణాలు..? పరిష్కారాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.