ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? 

సాక్షి లైఫ్ : ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపి స్తుంది..? అనే దానిపై ఇటీవల పరిశోధకులు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. దీని వ్యాప్తి గతంలో వచ్చిన వేరియంట్స్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుందని సరికొత్త పరిశోధనలో వెల్లడైంది. అయితే దాని మునుపటి వేరియంట్స్ తో పోలిస్తే గాలి ద్వారా సంక్రమించే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. 

యునైటెడ్ స్టేట్స్‌లోని పోల్కాట్, టెక్సాస్‌కు చెందిన డైరీ వర్కర్ నుంచి ఇటీవల కొన్ని శాంపిల్స్ సేకరించారు. ఆయా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ కొత్త వేరియంట్ గాలి ద్వారా మరింతమందికి సోకగలదని నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం నిర్ధారించింది.

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? ఇది ఎంత ఉంటే నార్మల్..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?

ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

 
టెక్సాస్ నుంచి వచ్చిన వైరస్ జాతి PB2-E627K అనే మ్యుటేషన్‌ను కలిగి ఉంది. పోల్కాట్, మింక్ నుంచి మరొక మ్యుటేషన్ PB2 T271A ఫెర్రెట్‌(ముంగీస వలే ఉండే ఒకరకమైన క్షీరదం)ల మధ్య వ్యాపించినట్లు కనుగొన్నారు. ఈ ఫలితాలను నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు గుర్తించారు.

పశువులలో కొనసాగుతున్న వైరల్ మహమ్మారి, వ్యవసాయ కార్మికులతో పాటు ఇతర క్షీరదాలకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో పాటు పాలు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున వ్యాప్తిని సమర్థవంతంగా నిరోధించడం చాలా కీలకమని అధ్యయనం పేర్కొంది.

పశువులలో, క్షీరదాలకు ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో..? గాలిలో ఏవిధంగా స్ప్రెడ్ అవుతుందో అనే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

 ఇన్ఫెక్షన్లను అధ్యయనం చేయడానికి ఫెర్రెట్స్ పై ప్రజారోగ్య ప్రమాదాన్ని అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు.

మానవులలో ఇన్ఫ్లుఎంజాను అధ్యయనం చేయడానికి ఫెర్రెట్‌లను ఉత్తమ జంతు నమూనాలలో ఒకటిగా పిలుస్తారు. ఎందుకంటే వ్యాధి , ప్రసారం, క్లినికల్ సంకేతాలు మనుషుల మాదిరిగానే ఉంటాయని సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ పేర్కొంది.

శాస్త్రవేత్తలు 2009 నుంచి H1N1 సీజనల్ ఫ్లూతో సహా ఆరు వేర్వేరు వైరస్‌లతో ప్రయోగాలు చేశారు. 2005 నుంచి ఇండోనేషియాలో గుర్తించిన H5N1 వైల్డ్-టైప్ జూనోటిక్ , దాని సవరించిన వెర్షన్ ఫెర్రెట్‌ల మధ్య వ్యాపించిందని కనుగొన్నారు. 

2024లో వచ్చిన నమూనాలు ముఖ్యంగా పౌల్ట్రీ, అడవి పక్షులు, సముద్ర ,భూసంబంధమైన క్షీరదాల మధ్య వేగంగా వ్యాపిస్తున్న క్లాడ్ 2.3.4.4bకి చెందినవి, దీని ఫలితంగా గ్లోబల్ ఎపిజూటిక్ ఏర్పడింది.
 
మార్చి 2024లో, ఈ వైరస్ యునైటెడ్ స్టేట్స్‌లోని పాడి ఆవులకు సోకినట్లు గుర్తించారు. అప్పటి నుంచి 15 రాష్ట్రాల్లోని 695 పాడి పశువులకు వ్యాపించింది. ఈ వైరస్ కోళ్లకు, పశువులకు సోకిన తర్వాత 55 మంది మనుషులకు కూడా వచ్చింది.

 

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : bird-flu bird-flu-symtoms swine-flu-symptoms avian-influenza h5n1 avian-flu human-cases-of-avian-flu clade-1b-virus clade-1-variant avian-flu-and-pets avian-flu-pandemic avian-flu-explained avian-flu-outbreak avian-flu-symptoms-in-chickens avian-flu-outbreak-2022
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com