క్యాన్సర్‌ను ఎలా నివారించవచ్చు..అంటే..?

సాక్షి లైఫ్ : ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధికైనా ముందస్తుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించడం ద్వారా కొంతమేర ఆయా వ్యాధి ముదరకుండా  జాగ్రత్త పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా క్యేన్సర్ విషయంలోనూ ముందుగా ఆ వ్యాధి లక్షణాలను గుర్తిస్తే తప్పకుండా దానిని నిర్మూలించడం సాధ్యమవుతుందని వారు అంటున్నారు.  

ఇది కూడా చదవండి.. న్యూ స్టడీ : యువతలో క్యాన్సర్ వేగంగా పెరగడానికి కారణాలు ఇవే.. 

 అవగాహనా కార్యక్రమాలు.. 
 
క్యాన్సర్ నివారణకు సంబంధించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జనాలను కొంతమేర అవగాహన కల్పించవచ్చు. అందులో భాగంగా ఈ వ్యాధికి కారణాలు, అందుబాటులో ఉన్న చికిత్స గురించి ప్రజలకు సమాచారం ఇవ్వాలి. 

రెగ్యులర్ చెకప్‌లు.. 

రెగ్యులర్ గా మెడికల్ చెకప్‌లు, క్యాన్సర్ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించడం ద్వారా క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను గుర్తించవచ్చు. తద్వారా ముందుగా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది.    

 

ఆరోగ్యకరమైన జీవనశైలి.. 

రోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ధూమపానం, మద్యపాన వ్యసనాలను మానేయడం గురించి అవగాహన కల్పించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

కాలుష్య నియంత్రణ.. 

పారిశ్రామికీకరణ వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. దీని కారణంగా కాలుష్యం పెరుగుతోంది. దీని ప్రభావం మనుషులపై పడుతోంది. క్యాన్సర్ కారకాల్లో కాలుష్యం కూడా ఒకటి. కాబట్టి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం చాలా అవసరం. 

హెచ్‌పివి వ్యాక్సిన్.. 

హెచ్‌పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. తల్లిపాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కొంతమంది చిన్నవయసులో తల్లిపాలు తాగకపోవడంతో రోగనిరోధక శక్తి బలహీనపడుతోంది. దీనివల్ల కూడా క్యేన్సర్ బారీన పడే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 
క్రమం తప్పకుండా  వైద్యపరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. 

  ఇది కూడా చదవండి.. మెదడుకు ఆక్సిజన్ ఎంతసేపటి వరకూ అందకపోతే డ్యామేజ్ అవుతుంది..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : blood-cancer stomach-cancer lung-cancer-symptoms cancer-types breast-cancer skin-cancer cancer-treatment prostate-cancer cancer-factors cancer-cases

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com