Walking Vs Memory : జ్ఞాపకశక్తిని కాపాడుకోవాలంటే నడక తప్పనిసరి.. తాజా పరిశోధనల్లో వెల్లడి
సాక్షి లైఫ్ : వయసు పైబడిన వారు ప్రతిరోజూ నడిచే నడక కేవలం శరీరానికే కాదు.. మెదడుకు కూడా టానిక్‌లా(tonic)పనిచేస్తుందని అంతర్జాతీయ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. రోజూ కొద్దిసేపు నడవడం వల్ల మతిమరుపు అల్జీమర్స్(Alzheimer's), ఇతర మానసిక సమస్యల ముప్పు గణనీయంగా తగ్గుతుందని (Harvard University) హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల తాజా అధ్యయనంలో తేలింది.
ఇది కూడా చదవండి..Women Outlive Men : ఆయుష్షులో 'ఆడవారే' మేటి.. మగాళ్ల ఆయువు ఎందుకు తగ్గుతోంది..? కేరళ యూనివర్సిటీ షాకింగ్ సర్వే..!
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
పరిశోధనలోని ఆసక్తికర అంశాలు..
సుమారు 14 ఏళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ అధ్యయనంలో 50 నుంచి 90 ఏళ్ల మధ్య వయసున్న వారిని పరిశీలించారు. వారి నడక వేగం, రోజూ వేసే అడుగుల సంఖ్యను బట్టి మెదడు ఆరోగ్యం ఎలా మారుతుందో విశ్లేషించారు. రోజుకు కనీసం 3వేల నుంచి 5వేల అడుగులు వేసే వారిలో మతిమరుపు వచ్చే ప్రమాదం మూడేళ్లు ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. రోజుకు 5వేల నుంచి 7,500 అడుగులు వేసే వారిలో జ్ఞాపకశక్తి మందగించే ముప్పు దాదాపు 7 ఏళ్ల వరకు వెనక్కి వెళ్తోందని తేలింది.
వ్యాయామం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి, జ్ఞాపకశక్తికి కేంద్రమైన 'హిప్పోకాంపస్' ప్రాంతం చురుగ్గా మారుతుంది. ఇది మెదడులోని విషతుల్యమైన ప్రోటీన్స్ అంటే టౌ ప్రోటీన్ (tau protein)పెరుగుదలను అడ్డుకుంటుంది.
ఎక్కువ దూరం నడవలేకపోయినా, ఇంట్లోనే చేసే చిన్నపాటి పనులు లేదా కుక్కతో కలిసి వాకింగ్ చేయడం వంటివి కూడా మెదడు చురుగ్గా ఉండటానికి దోహదపడతాయి. మెదడు ఆరోగ్యం కోసం జిమ్మ్ కి వెళ్లి కష్టపడక్కర్లేదు. రోజూ వేసే ప్రతి అడుగు ఒక పెట్టుబడి లాంటిది.
కొద్దిపాటి శారీరక శ్రమ మెదడులోని కణాల మధ్య అనుసంధానాన్ని పెంచి, వృద్ధాప్యంలో వచ్చే మానసిక సమస్యల నుంచి కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు నడక అలవాటు లేని వారు ఒకేసారి వేల అడుగులు వేయడానికి ప్రయత్నించకుండా, మెల్లగా అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
