Latest Study : బీపీ, షుగర్ నియంత్రణలో కర్కుమిన్ కీలక పాత్ర..

షేర్ చేయండి:
Latest Study : బీపీ, షుగర్ నియంత్రణలో కర్కుమిన్ కీలక పాత్ర..

సాక్షి లైఫ్ : మనం ప్రతిరోజూ మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అటువంటి వాటిలో చాలా ప్రధానమైంది పసుపు. ఇది అద్భుతమైన ఔషధ గుణాలకు నిలయమని మరోసారి రుజువైంది. పసుపులో ఉండే 'కర్కుమిన్' అనే పదార్ధం మధుమేహం (diabetes) ఉన్న వారిలో రక్తపోటును (blood pressure) తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

రక్తనాళాల పనితీరు.. 

మధుమేహం ఉన్నవారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా రక్తనాళాల గోడలు గట్టిబడటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అయితే, కర్కుమిన్ సప్లిమెంట్లను వాడటం ద్వారా రక్తనాళాల పనితీరు మెరుగుపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

 పసుపులోని కర్కుమిన్ రక్తనాళాల్లో ఉండే వాపును (Inflammation) తగ్గించి, రక్తం సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శారీరక ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేస్తాయి. క్రమ పద్ధతిలో కర్కుమిన్ తీసుకున్న వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ గణనీయంగా తగ్గినట్లు తాజా పరిశోధనలో తేలింది. అంతేకాదు రక్తపోటు నియంత్రణలో ఉండటం వల్ల భవిష్యత్తులో వచ్చే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందని వెల్లడైంది.

పసుపు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, రక్తపోటు కోసం మందులు వాడుతున్న వారు నేరుగా కర్కుమిన్ సప్లిమెంట్లను తీసుకునే ముందు తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి. ఆహారంలో భాగంగా పసుపును వాడటం ఉత్తమ మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు.

 

ఇది కూడా చదవండి..పీసీఓడీ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

ఇది కూడా చదవండి..సంతానోత్పత్తిని పెంచడానికి ఎలాంటి ఫుడ్స్ తప్పనిసరి అంటే..? 

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.